Bangalore: టాయ్‌లెట్‌లో మహిళ ఫోన్ నెంబర్ రాసి తోటిఉద్యోగి వేధింపులు...
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:53 PM
అనుచిత ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన ఓ మహిళ తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్(Railway stations, bus stand) టాయ్‌లెట్లలో మొబైల్ నెంబర్ రాసి అమ్మాయిలు కావాలా.. సంప్రదించండి అనే రాతలు తరచూ చూస్తుంటాం.
- ఫోన్ కాల్స్‌తో మహిళకు వేధింపులు
- మెజిస్టిక్ టాయ్‌లెట్‌లో ఆ ఉద్యోగి ఫోన్ నంబరు
- పోలీసులకు ఫిర్యాదు.. కోర్టుకు చేరిన కేసు
బెంగళూరు: అనుచిత ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన ఓ మహిళ తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్(Railway stations, bus stand) టాయ్‌లెట్లలో మొబైల్ నెంబర్ రాసి అమ్మాయిలు కావాలా.. సంప్రదించండి అనే రాతలు తరచూ చూస్తుంటాం. ఈ పిచ్చి రాతలే ఓ వ్యక్తి మెడకు చుట్టుకుని కోర్టుదాకా వెళ్లేలా చేశాయి. బెంగళూరు మెజస్టిక్‌లోని ఓ టాయ్‌లెట్‌లో ఓ మహిళ నెంబరు రాసి కాల్‌గర్ల్ కావాలా... అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ మహిళకు నిరంతరం ఫోన్‌కాల్స్ వచ్చేవి. నీ రేటెంత అంటూ అనుచితంగా మాట్లాడేకాల్స్ వస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అల్లాబక్ష్‌పాటిల్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి కేసును రద్దు చేయాలని కోరారు. అయితే కోర్టు సదరు పిటీషన్‌ను తిరస్కరించారు. చిత్రదుర్గలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల ఆమె పై అధికారి కోరిన మేరకు ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఇదికూడా చదవండి: ‘రివార్డ్’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్
ఇది జరిగిన కొన్ని రోజులకే ఆమెకు నిరంతరంగా ఫోన్‌కాల్స్ వచ్చేవి. దీంతో విసుగు చెందారు. ఫోన్ చేసిన కొందరికి ఈ నెంబరు మీకెలా వచ్చిందని ప్రశ్నించగా అల్లాబక్ష్‌పాటిల్ ఇచ్చారని, మెజిస్టిక్ టాయ్‌లెట్‌లో రాశారని మరికొందరు బదులిచ్చారు. ఈమేరకు ఆమె అల్లాబక్ష్‌పై ఫిర్యాదు చేశారు. మహిళను మానసికంగా వేధించడం ఇబ్బంది కలిగించే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కోర్టు తెలిపింది. మహిళల ఫొటోలు, వీడియోలు బహిరంగం చేయడంతో ఆమె వ్యక్తిగతానికి భంగం కలుగుతుందని ఇటువంటి సంఘటనలపై సమగ్ర తనిఖీలు జరపాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం పోలీసులను ఆదేశించింది. పిటీషన్‌ను రద్దు చేయలేమని కేసును ఎదుర్కొనాలని అల్లాబక్ష్‌కు కోర్టు సూచించింది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News