Bengaluru: కారు దూసుకెళ్ళి ఇద్దరి దుర్మరణం..
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:18 PM
తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కృష్ణగిరి జిల్లా డెంకణీకోట పరిధిలోని బి.శెట్టిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కెలమంగలం పోలీసులు(Kelamangalam Police) తెలిపిన వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాహనాల విడిభాగాలను తయారు చేస్తారు.
- ముగ్గురి పరిస్థితి విషమం
- చత్తీస్ ఘడ్‌కు చెందిన యువతులుగా గుర్తింపు
హోసూరు(బెంగళూరు): తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కృష్ణగిరి జిల్లా డెంకణీకోట పరిధిలోని బి.శెట్టిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కెలమంగలం పోలీసులు(Kelamangalam Police) తెలిపిన వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాహనాల విడిభాగాలను తయారు చేస్తారు. ఇందులో 500 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Ooty train: డీజిల్ ఇంజన్‌తో ఊటీ రైలు ట్రయల్ రన్
వీరిలో వంద మందికి పైగా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఉన్నారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన జయశ్రీ (22), శాంత (20), మాధురి , అస్మిత, కరణ్ సితార్ ఐదుగురు బుధవారం రాత్రి షిఫ్ట్‌ను ముగించుకుని ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. డెంక ణీకోట నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని కారు దూసుకెళ్లడంతో జయశ్రీ, శాంత అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్ర గాయాలైన మాధురి, అస్మిత, కరణ్‌లను స్థానికులు హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజు, కెలమంగలం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కెలమంగలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్ ఏ1
ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!
ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!
ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..
Read Latest Telangana News and National News