Share News

Chennai: ఐదుగురిని బలిగొన్న మద్యం మత్తు..

ABN , Publish Date - Nov 28 , 2024 | 10:29 AM

ఓ యువకుడి మద్యం మత్తు ఐదుగురిని బలిగొంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో యువకుడు నడిపిన కారు ఐదుగురి ప్రాణాలను హరించివేసింది. పొట్టకూటి కోసం గొర్రెల కాపలాకు వెళ్లి, మధ్యాహ్నం రోడ్డు పక్కన చెట్టు కింద సేదతీరుతుండగా, హఠాత్తుగా దూసుకొచ్చిన కారు వారందరినీ మృత్యుఒడిలోకి నెట్టేసింది.

Chennai: ఐదుగురిని బలిగొన్న మద్యం మత్తు..

- గొర్రెల కాపరులపైకి దూసుకెళ్లిన కారు

- మహిళల దుర్మరణం

- మహాబలిపురం సమీపంలో ఘటన

చెన్నై: ఓ యువకుడి మద్యం మత్తు ఐదుగురిని బలిగొంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో యువకుడు నడిపిన కారు ఐదుగురి ప్రాణాలను హరించివేసింది. పొట్టకూటి కోసం గొర్రెల కాపలాకు వెళ్లి, మధ్యాహ్నం రోడ్డు పక్కన చెట్టు కింద సేదతీరుతుండగా, హఠాత్తుగా దూసుకొచ్చిన కారు వారందరినీ మృత్యుఒడిలోకి నెట్టేసింది. చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా తిరుప్పోరూర్‌ సమీపంలోని పండిమేడు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన వివరాలిలా వున్నాయి... పండితమేడు ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరులు బుధవారం పశువులను మేతకు తోలుకెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: సీఎం నివాసం వద్ద కత్తితో యువకుడి సంచారం


వారు మధ్యాహ్నం రోడ్డు పక్కన కూర్చొని సేదతీరుతుండగా, చెన్నై నుంచి మహాబలిపురం(Chennai to Mahabalipuram) వైపు వెళ్తున్న కారు కూర్చునివున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. కారు అతి వేగంగా రావడంతో మృతదేహాలను కొద్దిదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు.. హూటాహూటిన అక్కడకు చేరుకుని కారు డ్రైవింగ్‌ చేసిన యువకుడిని, అతని వెంట వున్న మరో యువకుడిని చితకబాదారు.


nani1.jpg

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హూటాహూటిన అక్కడకు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో... మృతులు పండితమేడు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు(Chengalpattu) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కారు డ్రైవింగ్‌ చేసిన యువకులు మద్యం మత్తులో వున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఈ ఘటనను ఖండిస్తూ గ్రామస్తులు రోడ్డురోకో చేపట్టారు. ఆ యువకులను తమకు అప్పగించాలంటూ పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో, జిల్లా ఎస్పీ అక్కడకు చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. ఇదిలా వుండగా దుర్ఘటన పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన సీఎం స్టాలిన్‌.. మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 10:29 AM