Share News

Honour Killing: తమిళనాడులో దారుణం.. అబ్బాయి వేరే కులానికి చెందినవాడు కావడంతో..

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:34 PM

తమిళనాడులో (Tamilnadu) ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. వేరే కులానికి చెందినవాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. అమ్మాయి తరఫు బంధువులు ఆమె భర్తను అతి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో బాధితురాలి బావతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడ్ని మెకానిక్‌గా పని చేస్తున్న ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన చెన్నై (Chennai) నగరానికి సమీపంలోని పల్లికరణై ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ (Praveen), షర్మిల (Sharmila) ప్రేమికులు. ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. ప్రవీణ్‌ది వేరే కులం కావడంతో ఈ పెళ్లికి అమ్మాయి తరఫు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో.. పెద్దలను ఎదురించి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం నాలుగు నెలల క్రితం జరిగింది. అప్పటి నుంచి షర్మిల కుటుంబీకులు ప్రవీణ్‌పై పగ పెంచుకున్నారు. అతడ్ని అంతమొందించాలని ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలోనే.. శనివారం అతనిపై దాడి చేశారు. భోజనం తెచ్చేందుకు ప్రవీణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. షర్మిల సోదరుడు దినేశ్‌తో పాటు జ్యోతి లింగం, శ్రీరాం, అశోక్, విష్ణు రాజ్ అతడ్ని చుట్టుముట్టారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయారు.

మరోవైపు.. భోజనం తెచ్చేందుకు వెళ్లిన ప్రవీణ్ రెండు గంటలైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో ప్రవీణ్ తండ్రి గోపి ఆందోళన చెందారు. అదే సమయంలో షర్మిల ఏడవడం ప్రారంభించడంతో.. ఏదో తప్పు జరిగిందని గ్రహించానని ఆయన చెప్పారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అతడు మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తన కొడుకుని కిరాతకంగా చంపిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని గోపి కోరారు. అలాగే.. తన కోడల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 08:34 PM