Share News

Chennai: సీఎం నివాసం వద్ద కత్తితో యువకుడి సంచారం

ABN , Publish Date - Nov 27 , 2024 | 01:52 PM

ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నివాసగృహం పరిసరాల్లో కత్తితో సంచరించిన యువకుడిని పోలీసులు నిర్బంధించారు. తేనాంబపేట సెంటాఫ్ రోడ్డు(Thenambapet Centoff Road)లో స్టాలిన్‌ నివసిస్తున్నారు.

Chennai: సీఎం నివాసం వద్ద కత్తితో యువకుడి సంచారం

చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నివాసగృహం పరిసరాల్లో కత్తితో సంచరించిన యువకుడిని పోలీసులు నిర్బంధించారు. తేనాంబపేట సెంటాఫ్ రోడ్డు(Thenambapet Centoff Road)లో స్టాలిన్‌ నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఆ నివాసం వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా చేతిసంచితో సంచరించాడు. అనుమానించిన ముఖ్యమంత్రి భద్రతాదళానికి చెందిన పోలీసులు అతడిని ఆపి సంచిలో చూసి దిగ్బ్రాంతి చెందారు. ఆ సంచిలో కత్తి ఉండటంతో వెంటనే అతడిని నిర్బంధించి తేనాంపేట పోలీసుస్టేషన్‌(Thenampet Police Station)కు తీసుకెళ్ళి విచారణ జరిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: మహిళలు, చిన్నారులపై వేధింపులు సహించం..


nani1.2.jpg

ఆ విచారణలో ఆ యువకుడు మరైమలర్‌నగర్‌కు చెందిన జాన్‌ అని తెలిసింది. పోలీసులు కత్తి గురించి ప్రశ్నించగా మరైమలర్‌ నగర్‌ నుంచి రైలులో నుంగంబాక్కం వచ్చానని, ఆ సమయంలో అక్కడ పడి ఉన్న కత్తిని చూసి కూరగాయలు తరిగేందుకు పనికి వస్తుందని సంచిలో వేసుకున్నానని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అతడి వివరాలు తీసుకుని విడిచి పెట్టారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 01:52 PM