Home » CM Stalin
సినీనటుడు, ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత కమల్‌హాసన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు వ్యతిరేకంగా జరిపిన న్యాయపోరాటంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గెలిచిన ఆనందోత్సాహంలో తాను కూడా పాలుపంచుకున్నానన్నారు.
చెన్న మహానగరంలో కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అంటూ పిలుపునిచ్చి సోషలిస్టు భావాలను వ్యాపింపజేసిన ప్రముఖ సోషలిస్టు విప్లవకారుడు, సామాజిక వేత్త కార్ల్మార్క్స్ను భావితరాలు గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు.
గత ఎన్నికల సమయంలో మేం ఇచ్చిన మాట ప్రకారం కావేరి-వైగై-గుండారు నదుల అనుసంధానం చేసి తీరుతామని మంత్రి దురైమురుగన్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. నదుల అనుసంధానం విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమాలు అవసరం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.
నియోజకవర్గ పునర్విభజనపై తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానం ప్రారంభం మాత్రమేనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. చెన్నైలో చేసిన సంకల్పం హైదరాబాద్‌లో నెరవేరిందని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వం పదివేల కోట్లిచ్చినా రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శనివారం చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైన నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శాలువా కప్పి, ఓ బాక్స్‌ను బహూకరించారు.
తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమాచార సాధానాలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. అలాగే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్దమతున్నాయి. దీంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన విషయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తమిళనాడు సీఎం స్టాలిన్ ఓవైపు హిందీ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్..స్టాలిన్ వైఖరిపై నిన్న జనసేన ఆవిర్భావ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.