Illegal Migration: 60 మంది నుంచి రూ.80 లక్షల చొప్పున వసూలు..అక్రమంగా అమెరికాకు 14 మందిపై కేసు
ABN , Publish Date - Jan 13 , 2024 | 12:43 PM
భారత్(Bharat) నుంచి అగ్రరాజ్యం అమెరికా(America)కు అక్రమంగా వెళ్లే(Illegal Migration) వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గత నెలలో నికరాగ్వాకు అక్రమంగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ నుంచి మెక్సికో సరిహద్దుల గుండా 60 మందికి పైగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
భారత్(Bharat) నుంచి అగ్రరాజ్యం అమెరికా(America)కు అక్రమంగా వెళ్లే(Illegal Migration) వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గత నెలలో నికరాగ్వాకు అక్రమంగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ నుంచి మెక్సికో సరిహద్దుల గుండా 60 మందికి పైగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వారిని అక్రమంగా పంపేందుకు ప్రయత్నించిన 14 మంది ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: సినీ నిర్మాతను అగౌరవ పరిచేలా పోస్టులు.. రైటర్‌పై కేసు నమోదు
అయితే కేసు నమోదైన ఏజెంట్లలో గుజరాత్, ఢిల్లీ, ముంబై, దుబాయ్‌లకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు. వారిలో ఎక్కువ మంది గుజరాత్(gujarat)కు చెందినవారేనని అధికారులు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏజెంట్లలో ఢిల్లీకి చెందిన జోగేంద్ర అలియాస్ జగ్గీ పాజీ, జోగిందర్ మన్శ్రమ్, ముంబైకి చెందిన రాజాభాయ్, రాజు పంచల్, దుబాయ్‌కి చెందిన సలీం ఉన్నారు. కాగా ఇతర నిందితుల్లో చంద్రేష్ పటేల్, కిరణ్ పటేల్, భార్గవ్ దర్జీ, సందీప్ పటేల్, పీయూష్ బరోట్, అర్పిత్ సింగ్ జాలా, బీరెన్ పటేల్, జయేష్ పటేల్, సామ్ పాజీ ఉన్నారు.
అంతేకాదు మొబైల్ ఫోన్‌ల నుంచి ఆడియో ఫైల్స్, ఇతర ప్రయాణ సంబంధిత విషయాలను తొలగించమని ఏజెంట్లు ప్రయాణికులను బలవంతం చేశారని పోలీసు అధికారులు చెప్పారు. అంతేకాదు ఒక్కో ప్రయాణికుడు అమెరికా చేరుకున్న తర్వాత ఈ ఏజెంట్లు 60 నుంచి 80 లక్షల రూపాయలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఏజెంట్లపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 370 ప్రకారం మానవ అక్రమ రవాణా, సెక్షన్ 201 సాక్ష్యాధారాల మార్పిడి, సెక్షన్ 120-B నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేయబడింది. డిసెంబరులో మూడు వేర్వేరు పర్యటనల్లో ఈ ఏజెంట్లు చాలా మందిని నికరాగ్వాకు పంపినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు అన్నారు. ఈ ఏజెంట్లు అమెరికా, మెక్సికో, నికరాగ్వా, దుబాయ్, ఢిల్లీలో నివసిస్తున్న ప్రధాన ఏజెంట్ల సహకారంతో పనిచేశారు.