Share News

Rangareddy: రూ.500 కోసం మద్యం మత్తులో ఘర్షణ.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:00 AM

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్‌‌లో అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాద్వాగం చోటు చేసుకుంది. అతి కాస్త ఘర్షణకు దారి తీసి ఇద్దరూ దారుణంగా కొట్టుకున్నారు.

Rangareddy: రూ.500 కోసం మద్యం మత్తులో ఘర్షణ.. చివరికి ఏమైందంటే..
Rajendranagar

రంగారెడ్డి: రాజేంద్రనగర్ (Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్‌ (Budvel)లో దారుణ ఘటన వెలుగు చూసింది. రూ.500ల కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. శ్రీనివాస్ (Srinivas) అనే డైలీ లేబర్ సాయి (Sai) అనే గుత్తేదారు వద్ద పని చేస్తున్నాడు. అయితే తన అవసరం నిమిత్తం శ్రీనివాస్ వద్ద సాయి రూ.500లు అప్పుగా తీసుకున్నాడు. అయితే రోజుల గడుస్తున్నా అతను అప్పు తిరిగి ఇవ్వలేదు.


నగదు ఇవ్వాలంటూ సాయిని శ్రీనివాస్ అడిగాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని కొన్ని రోజులు ఆగి చెల్లిస్తానని సాయి చెప్పాడు. నగదు తీసుకుని చాలా రోజులైందని, కేవలం రూ.500లు ఇచ్చేందుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటావంటూ శ్రీనివాస్ కోపానికి లోనైయ్యాడు. సాయి మాత్రం తన వద్ద నగదు లేదంటే లేదని తేల్చి చెప్పాడు. ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.


వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. అనంతరం ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించున్నారు. తీవ్ర ఆవేశానికి లోనైనా సాయి పక్కనే ఉన్న డ్రైనేజీ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై బలంగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శంషాబాద్‌ విమానాశ్రయంలో మద్యం మత్తులో ప్రయాణికురాలి హల్‌చల్‌

Employees: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి...

Updated Date - Dec 30 , 2024 | 07:01 AM