Punjab DSP: పంజాబ్‌లో కెనాల్ పక్కన మృతదేహం..హత్యకు గురైన డీఎస్పీ?
ABN , Publish Date - Jan 02 , 2024 | 11:30 AM
ఓ పోలీసు ఉన్నతాధికారి డీఎస్పీని కాల్చి చంపి కెనాల్ పక్కన పడేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పంజాబ్(Punjab)లోని జలంధర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్ సాయుధ పోలీసు (PAP)లో పోస్ట్ చేయబడిన DSP దల్బీర్ సింగ్ డియోల్(Dalbir Singh deol) బుల్లెట్ కాల్పులతో మృత్యువాత చెందారు. అయితే అతని మృతదేహం సంగ్రూర్‌లోని బస్తీ బావా ఖేల్ కెనాల్ సమీపంలో రోడ్డు పక్కన డిసెంబర్ 31న అర్ధరాత్రి పడి ఉంది. ఆ క్రమంలో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వారు అతని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతని మృతికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
అయితే అతని తలకు బలమైన గాయం ఉందని, ఒక కాలుకు గాయమైనట్లు పోలీసులు(police) వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీని ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి చర్యలను ముమ్మరం చేశారు. అయితే పోస్టుమార్టంలో డీఎస్పీ మెడకు బుల్లెట్ గాయం తగిలినట్లు తేలింది. ఈ క్రమంలో దల్బీర్ సింగ్ డియోల్‌ను కాల్చి చంపి, మృతదేహాన్ని రోడ్డుపై విసిరివేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం జలంధర్‌లో ఓ గ్రామానికి చెందిన పలువురితో డీఎస్పీ(DSP) గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోజు ఆ గ్రామస్థులతో రాజీ పడినప్పటికీ కొంత మంది వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ డీఎస్పీ వెయిట్ లిఫ్టింగ్‌లో ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. దీంతోపాటు అతనికి 2000 సంవత్సరంలో అర్జున అవార్డు పురస్కారం కూడా లభించింది.