Hash oil: హాష్‌ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..
ABN , Publish Date - Aug 18 , 2024 | 11:51 AM
నిషేధిత హాష్ ఆయిల్(Hash oil)ను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. అతడి నుంచి 10 లక్షల రూపాయాల విలువచేసే 1291గ్రాముల హాష్‌ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
10 లక్షల విలువచేసే 1291గ్రాముల ఆయిల్ స్వాధీనం
హైదరాబాద్: నిషేధిత హాష్ ఆయిల్(Hash oil)ను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. అతడి నుంచి 10 లక్షల రూపాయాల విలువచేసే 1291గ్రాముల హాష్‌ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీపీ కె. సురేష్ కుమార్(DCP K. Suresh Kumar) వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళీ మండలం, మొంచలపేట్ గ్రామానికి చెందిన అల్లా సింహాచలం అలియాస్ సాయి, సైబు, సిద్ధార్థ(27) వృత్తి రీత్యా వెల్డర్‌గా పని చేస్తున్నాడు.
ఇదికూడా చదవండి: Hussainsagar: హుస్సేన్‌సాగర్ గేట్ ఎత్తివేత
చింతల్ పద్మానగర్ ఫేజ్-2లో నివాసముంటున్న సింహాచలం గత రెండు సంవత్సరాల క్రితం డ్రగ్ విక్రయిస్తున్న సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. హరీష్, దేవా, దినేష్ రెడ్డి, కె.పాండు, రాజా, రాములతో అనేక మంది హైదరాబాద్(Hyderabad) వాసులతో వ్యాపారం సాగిస్తున్నాడు. కొంత కాలం వ్యాపారం ఆపివేసిన సింహాచలం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆరు నెలలుగా తిరిగి డ్రగ్ దందా కొనసాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో సింహాచలం చింతపల్లి(Simhachalam Chintapalli)కి వెళ్లి 2లీటర హాష్ ఆయిల్ తీసుకువచ్చి 5ఎంఎల్ బాటిల్స్‌లో నింపి అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు.
పక్కా సమాచారంతో టీజీఏన్యాబ్, బాలానగర్ పోలీసులు శనివారం ఉదయం సింహాచలం నివాసంపై దాడిచేసి 1291 గ్రాముల హాష్‌అయిల్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్ విక్రయదారులను గుర్తించారు. వారిలో యూసు్‌ఫగూడకు చెందిన సిండి సాయిచరణ్ (25), అదే ప్రాంతానికి చెందిన బన్నీ ఉదయ్‌భాను(25), అమీర్‌పేట్‌కు చెందన రాపర్తి ఉదయ్(23), ఉప్పల్‌కు చెందిన పాలెం వికా్‌సనాయుడు(25)లను గుర్తించారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారని గమనిస్తే 87126 71111, లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలియజేశారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News