Hyderabad: 1,100 సెల్‌ఫోన్లు.. విలువ రూ.3.30 కోట్లు
ABN , Publish Date - Dec 11 , 2024 | 06:44 AM
సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) అరుదైన ఘనత సాధించారు. 45 రోజుల్లోనే రూ.3.30 కోట్ల విలువైన 1100 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. క్రైమ్ డీసీపీ నరసింహ(Crime DCP Narasimha) పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌లుగా రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఈ ఘనత సాధించారు.
- 45 రోజుల్లోనే రికవరీ చేసిన పోలీసులు
- బాధితులకు అందజేసిన సైబర్ సీసీఎస్ క్రైమ్స్ డీసీపీ నరసింహ
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) అరుదైన ఘనత సాధించారు. 45 రోజుల్లోనే రూ.3.30 కోట్ల విలువైన 1100 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. క్రైమ్ డీసీపీ నరసింహ(Crime DCP Narasimha) పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌లుగా రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఈ ఘనత సాధించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో డీసీపీ నరసింహ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: రేషన్ బియ్యం పక్కదారి
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రద్దీగా ఉండే బస్సులు, నిర్మానుష్య ప్రాంతాలు.. ఒంటరిగా అజాగ్రత్తగా వెళ్తున్న నగరవాసుల నుంచి చాకచక్యంగా సెల్‌ఫోన్‌లను కొట్టేసి కొందరు ఉడాయిస్తున్నారని డీసీపీ తెలిపారు. ఒక్కనెలలోనే కొన్ని వేలసంఖ్యలో మొబైల్స్ చోరీ అయినట్లు కేసులు నమోదయ్యాయని, దీంతో ఐటీసెల్ సహకారంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సీసీఎస్ పోలీసులను ప్రత్యేక టీమ్‌లుగా రంగంలోకి దింపినట్లు తెలిపారు.
చోరీకి గురైన సెల్‌ఫోన్ల జాడను గుర్తించి వాటిని నేరస్థుల నుంచి, కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి రికవరీ చేశామని వెల్లడించారు. ఫోన్‌ల రికవరీ ప్రక్రియను ఒక ప్రత్యేక డ్రైవ్‌లా చేపట్టి, కేవలం 45 రోజుల్లో 1100 ఫోన్‌లు రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ.3.30 కోట్లు ఉంటుందని వెల్లడించారు. తక్కువ సమయంలో ఇంత ఎక్కువగా ఫోన్‌లు రికవరీ చేసిన సిబ్బందిని డీసీపీ అభినందించారు. అనంతరం రికవరీ చేసిన ఫోన్‌లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ‘పోయిందనుకున్న ఫోన్ తిరిగి రికవరీ చేసి భద్రంగా అందజేశారు. మీ మేలు మరిచిపోలేం సార్.. చాలా చాలా కృతజ్ఞతలు’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్
ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్!
ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు
Read Latest Telangana News and National News