Share News

Hyderabad: డాన్‌గా ఎదగడానికి ప్రత్యేక డెన్‌ ఏర్పాటు.. చివరకు ఏమయ్యాడంటే..

ABN , Publish Date - Dec 04 , 2024 | 08:28 AM

నకిలీ బెయిల్‌ పత్రాలతో జైలు అధికారులను బురిడీ కొట్టించి.. చంచల్‌గూడ జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్‌ ఖైదీ సుజాత్‌ అలీఖాన్‌(Sujat Ali Khan) కోసం హైదరాబాద్‌ సిటీ పోలీసులు గాలిస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ పోలీస్‌ కమిషర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో డబీర్‌పురా, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు.

Hyderabad: డాన్‌గా ఎదగడానికి ప్రత్యేక డెన్‌ ఏర్పాటు.. చివరకు ఏమయ్యాడంటే..

- వివాదంలో ఉన్న భూములే లక్ష్యంగా.. కబ్జాలు

- డెన్‌ను కూలగొట్టి కటకటాల్లోకి నెట్టిన సైబరాబాద్‌ పోలీసులు

- వెలుగులోకి వస్తున్న సుజాత్‌ అలీఖాన్‌ నేరాలు

- దొంగ బెయిల్‌తో బయటపడ్డ ఖైదీ

హైదరాబాద్‌ సిటీ: నకిలీ బెయిల్‌ పత్రాలతో జైలు అధికారులను బురిడీ కొట్టించి.. చంచల్‌గూడ(Chanchalguda) జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్‌ ఖైదీ సుజాత్‌ అలీఖాన్‌(Sujat Ali Khan) కోసం హైదరాబాద్‌ సిటీ పోలీసులు గాలిస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ పోలీస్‌ కమిషర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) ఆదేశాలతో డబీర్‌పురా, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు. దొంగ బెయిల్‌ తయారు చేయడంలో నిందితునికి సహకరించిన వ్యక్తులతోపాటు.. టెక్నికల్‌, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ ద్వారా నిందితుని ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేడో రేపో నిందితుడిని పట్టుకొని జైలు అధికారులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: భూమిలో వర్షపు నీరు ఇంకుతున్నది 0.95 శాతమే..


- సెటిల్‌మెంట్లు, నకిలీ పత్రాలతో భూకబ్జాలు

మొదటి నుంచి నేర చరిత్ర కలిగిన నిందితుడు.. కబ్జాలు, సెటిల్‌మెంట్లతో రూ. కోట్ల రూపాయలు సంపాదించి డాన్‌గా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొంతమంది అనుచరులు, అల్లరి మూకలతో సుజాత్‌ అలీఖాన్‌ గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. వారి సహకారంతో వివాదాస్పద భూములు, బలహీనుల భూములను లక్ష్యంగా చేసుకొని కబ్జా చేసేవాడు. నకిలీ పత్రాలు సృష్టించి తన అనుచరులను కబ్జా స్థలంలో కాపలా పెట్టేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే గ్యాంగ్‌లతో బెదిరింపులకు పాల్పడి సెటిల్‌మెంట్‌ చేసి భూమి లాక్కునేవాడని తెలిసింది.


మాటలతో దారికి వారిని భయపెట్టి కిడ్పాప్‌ చేసి లొంగదీసుకోవడానికి శంషాబాద్‌ పరిధిలోని ఒక ఫామ్‌హౌజ్‌ను డెన్‌గా మార్చుకున్నాడు. లోపలకు కుక్కల కాపలాగా ఉంచేవాడు. ఫామ్‌హౌజ్‌ (డెన్‌) చుట్టూ ఎతైన ప్రహరీ నిర్మించాడు. గోడచుట్టూ ముళ్లకంచెతో పాటు.. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తను కబ్జా చేసిన భూవివాదాల్లో తలదూర్చి నా.. భయపడకుండా ఎదురు తిరిగినా వారిని కిడ్నాప్‌ చేసి, ఫామ్‌హౌజ్‌ డెన్‌కు తరలిస్తారు. అక్కడ కుక్కలను వదలి, చంపేస్తామని బెదిరించి దారికి తెచ్చుకుంటారని సైబరాబాద్‌ పోలీసుల విచారణలో తేలింది.


ఐదు నెలల క్రితం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కబ్జాకు గురైన భూమి విషయంలో తలదూర్చిన ఓ దళిత నాయకున్ని కిడ్నాప్‌ చేసి, ఫామ్‌హౌజ్‌కు తరలించిన చిత్ర హింసలకు గురిచేసిన కేసులో సుజాత్‌ అలీఖాన్‌ ప్రధాన నిందితుడు. కాగా.. దళిత నాయకుడిని రక్షించే క్రమంలో రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి శంషాబాద్‌ పరిధిలో ఉన్న ఫామ్‌హౌజ్‌ డెన్‌ను గుర్తించారు. ఫామ్‌హౌజ్‌ గోడలను బద్దలుకొట్టారు. అక్కడున్న కుక్కలను, గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు.


అతని గ్యాంగ్‌లోని సభ్యులనూ అరెస్టు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి నవంబరు-26న రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత తన క్రిమినల్‌ బుర్రకు పదును పెట్టిన సుజాత్‌ అలీఖాన్‌ జైలు నుంచే పథకం రచించి తన అనుచరుల సహకారంతో నకిలీ బెయిల్‌ పత్రాలు సృష్టించి నవంబరు-29న జైలు నుంచి విడుదలై వెళ్లిపోయాడు. ఆ బెయిల్‌ పత్రాలు నకిలీవని గుర్తించిన జైలు అధికారులు హుటాహుటిన డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.


దొంగ బెయిల్‌ కేసులో ఇద్దరు హెడ్‌ వార్డర్ల సస్పెన్షన్‌

- జైలర్‌కు షోకాజ్‌ మెమో జారీ

సైదాబాద్‌: పాత బెయిల్‌ పత్రాలను ఫోర్జరీ చేసి, చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన రిమాండ్‌ ఖైదీ సుజాత్‌ అలీఖాన్‌ వ్యవహరంపై జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపించిన డీజీ.. ప్రాథమిక నివేదిక ఆధారంగా హెడ్‌వార్డర్లు రాజగోపాల్‌, భిక్షపతి నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించి, వారిని సస్పెండ్‌ చేశారు. జైలర్‌ దేవీసింగ్‌కు షోకాజ్‌ మెమో జారీ చేశారు. ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించండి’ అని అందులో వివరణ కోరినట్లు జైళ్లశాఖ వర్గాలు తెలిపాయి. గత నెల 26న నకిలీ బెయిల్‌ పత్రాలతో సుజాత్‌ అలీ విడుదలవ్వగా.. 29వ తేదీన డబీర్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పురోగతి, జైలులో నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది? అన్నదానిపై డీజీ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2024 | 08:28 AM