Hyderabad: డబ్బులిస్తామని నమ్మించి పుస్తెలతాడు చోరీ
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:53 PM
డబ్బులిస్తామని నమ్మించి పట్టపగలు ఓ మహిళ పుస్తెలతాడు చోరీ చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ గణే్‌షనగర్‌కు చెందిన మనసాని సుగుణ (55) గురువారం ఉదయం రేషన్ తీసుకోవడానికి స్థానికంగా నడుచుకుంటూ వెళుతోంది.
హైదరాబాద్: డబ్బులిస్తామని నమ్మించి పట్టపగలు ఓ మహిళ పుస్తెలతాడు చోరీ చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ గణే్‌షనగర్‌కు చెందిన మనసాని సుగుణ (55) గురువారం ఉదయం రేషన్ తీసుకోవడానికి స్థానికంగా నడుచుకుంటూ వెళుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని.. యువతి తల్లి, తమ్ముడి హత్య
గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కమాన్ వద్ద నిలబడి మహిళను ఆపారు. కొంత దూరంలో నిలబడి ఉన్న ఓ వ్యక్తిని చూపిస్తూ అతను తమిళనాడుకు చెందిన వారని, అతని దగ్గర రూ. 4లక్షలు ఉన్నాయని ఆమెకు తెలిపారు. ‘ఆయనకు టిఫిన్ తినిపించి బస్సు ఎక్కిస్తే మాకు రూ.4 లక్షలు ఇస్తాడు. అందులో నీకు కొంత డబ్బు ఇస్తాం’అని నమ్మబలికారు. దీంతో మహిళ ఆటోలో వారితో కలిసి షాపూర్‌నగర్(Shahpurnagar)కు వెళ్లింది.
అక్కడ ‘తమిళనాడుకు చెందిన వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి తమను నమ్మడం లేదని, నీ దగ్గర ఉన్న పుస్తెలతాడు(4తులాలు) కర్చీ్‌ఫలో పెట్టి ఇస్తే అతడికి చూపించి మళ్లీ నీకే ఇస్తాం’అని తెలిపారు. ఆమె వారు చెప్పిన విధంగా చేసింది. తర్వాత ఆ వ్యక్తులు మహిళను ఆటో ఎక్కించి కర్చీ్‌ఫలో పుస్తెలతాడు ఉందని, దాంతో పాటు ఒక సంచిలో ఐదు వందల నోట్ల కట్ట అని పేపర్ బండిల్ పెట్టి ఇచ్చి పంపించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమె కర్చీఫ్ తెరిచి చూడగా పుస్తెలతాడు కనిపించలేదు. డబ్బులూ లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News