Share News

Hyderabad: పరిచయస్తులే పగబడుతున్నారు.. నిందితుల్లో స్నేహితులే అధికం

ABN , Publish Date - Dec 24 , 2024 | 08:02 AM

మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు మృగాళ్లు మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నా.. షీటీమ్స్‌(Shee teams)ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోకిరీల భరతం పడుతున్నా.. అరాచకాలు, అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు.

Hyderabad: పరిచయస్తులే పగబడుతున్నారు.. నిందితుల్లో స్నేహితులే అధికం

హైదరాబాద్‌ సిటీ: మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు మృగాళ్లు మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నా.. షీటీమ్స్‌(Shee teams)ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోకిరీల భరతం పడుతున్నా.. అరాచకాలు, అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు. ఈ ఏడాది ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే 384 అత్యాచార కేసులు నమోదైనట్లు నేర వార్షిక నివేదికలో వెల్లడైంది. మొత్తం కేసుల్లో నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేకరైళ్లు


అయితే అత్యాచారం కేసుల్లో నిందితులను పరిగణనలోకి తీసుకుంటే.. వందకు వందశాతం తెలిసినవారే కావడం గమనార్హం. 384 మంది నిందితుల వివరాలపై ఆరా తీయగా.. లైంగికదాడికి పాల్పడిన వారిలో 322 మంది బాధితురాళ్ల స్నేహితులే ఉన్నట్లు తేలింది. బాధితురాలితో పరిచయం పెంచుకొని స్నేహం చేసి, ఆ తర్వాత అదును చూసి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా.. నిందితుల్లో 17 మంది పక్కింటి వారుగా.. ఐదుగురు బంధువులుగా ఉన్నారు. మరో 40 మంది వివరాలను పరిశీలించగా.. తోటి వర్కర్లు, సర్వెంట్లు, గార్డియన్స్‌, డ్రైవర్లు, ఇతరులు ఉంటున్నట్లు తేలిందని సీపీ వెల్లడించారు.


ఆటకట్టిస్తున్నా.. ఆగని అరాచకాలు..

ప్రేమించలేదని.. పెళ్లికి ఒప్పుకోలేదని ఒకడు.. లైంగికంగా సహకరించలేదని మరొకడు.. వేరొకరితో చనువుగా మాట్లాడుతోందని ఇంకొకడు.. ఇలా రకరకాల కారణాలతో మహిళలపై కక్ష పెంచుకొని అదును చూసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదురు దాడికి దిగిన మహిళలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న కేసుల్లో నిందితులకు ఇటీవల యావజ్జీవ కారాగారం, 20 ఏళ్లు,. 15 ఏళ్లు కఠిన శిక్షలు అమలు చేశారు. అయినా మృగాళ్లలో మార్పు రావడంలేదు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు..

డయల్‌-100, చైల్డ్‌ హెల్స్‌లైన్‌ నంబర్‌ - 1098, వాట్సాప్‌ నంబర్‌- 8712662111. రాచకొండ పోలీస్‌ ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విటర్‌), ఇన్‌స్టా వంటి సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 08:02 AM