Hyderabad: ఆర్నెళ్ల చిన్నారిని లాక్కున్నారు.. తల్లిని వెళ్లగొట్టారు..
ABN , Publish Date - Dec 25 , 2024 | 08:48 AM
ఆరు నెలల చిన్నారిని తల్లినుంచి వేరుచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారు.. మానసికంగా వేధించడంతో ఆమె, ఆమె తండ్రి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మంగళవారం ఆమె తండ్రి చనిపోయాడు.
- అనారోగ్యమంటూ చేరదీయని భర్త
- మానసికంగా వేధించిన అత్తా మామలు
- మనోవ్యధను భరించలేక తండ్రితో కలిసి ఆత్మహత్యాయత్నం
- తండ్రి మృతి.. కుమార్తె డిశ్చార్జి
హైదరాబాద్: ఆరు నెలల చిన్నారిని తల్లినుంచి వేరుచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారు.. మానసికంగా వేధించడంతో ఆమె, ఆమె తండ్రి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మంగళవారం ఆమె తండ్రి చనిపోయాడు. కోలుకున్న ఆమె ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయింది. ఈ సంఘటన ఆల్వాల్ పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గోనె సంచిలో డెడ్‌బాడీ..
కరీంనగర్ జిల్లా, రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి(60) ఆర్టీసీ ఉద్యోగి. కొన్నేళ్లుగా ఆయన తన భార్య పద్మతో కలిసి అల్వాల్‌లోని రీట్రిట్ కాలనీలో ఉంటున్నాడు. ఆయన తన కుమార్తె స్నేహ(30)ను సూరారం ప్రాంతానికి చెందిన నవీన్‌రెడ్డికి ఇచ్చి 2021లో పెళ్లి చేశారు. ఆ వెంటనే నవీన్‌రెడ్డి, స్నేహలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల నిమిత్తం ఆమెరికాకు వెళ్లారు. 2024 మార్చిలో వారికి ఒక పాప జన్మించింది. డెలివరీ సమయంలోనే స్నేహ అనారోగ్యానికి గురయ్యింది. దీంతో భర్త నవీన్‌రెడ్డి మే నెలలో భార్య స్నేహను నెలన్నర పసిపాపతో హైదరాబాద్‌లోని పుట్టింటికి పంపించాడు.
అయితే, నవీన్‌రెడ్డి తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, గజ్జెల పద్మ ఆగస్టులో అల్వాల్‌కు వచ్చి కోడలు స్నేహను, ఆమె తండ్రి జగన్‌మోహన్‌రెడ్డిని మానసికంగా వేధించారు. అనారోగ్యంగా ఉన్నావంటూ దూషిస్తూ.. నీవు మాకొద్దంటూ వారిని అవమాన పరుస్తూ చిన్నారిని బలవంతంగా వారు సూరారంలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. భర్త సైతం ఆమెను చేరదీయకపోవడంతో స్నేహ, ఆమె తండ్రి జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు సూరారం వెళ్లి పసిపాపను ఇవ్వాలని కోరినా వినిపించుకోకుండా అవమాన పరుస్తూ వెళ్లగొట్టారు.
ఈనెల 12న సైతం అత్తారింటికి తండ్రితో కలిసి వెళ్లిన స్నేహను అవమానకర రీతిలో దూషించడంతో వెనుదిరిగారు. మార్గమధ్యలో బోయిన్‌పల్లిలో ఓ వైద్యుడిని కలిసి అల్వాల్‌కు వస్తున్న క్రమంలో బిర్యానీని, క్రిమిసంహారక మందును కొనుగోలు చేసి తిన్నారు. ఇంటికి చేరుకునే సరికి వారిద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లగా కుటుంబసభ్యులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మరణించారు. స్నేహ మంగళవారం ఆస్పత్రి నుంచి డిచార్జ్ చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!
ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News