Hyderabad: రూ.7.5కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 06 , 2024 | 10:21 AM
ఏడాది కాలంగా నగరంలో 208 కేసుల్లో పట్టుబడిన రూ.7.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీటిని నందిగామ పరిధిలోని బయో మెడికల్ వేస్టు మేనేజ్‌మెంట్ కంపెనీ మల్టీక్లేవ్ ప్రై. లిమిటెడ్‌లో ధ్వంసం చేయనున్నారు.
- ఏడాది కాలంలో రూ.10.58 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నాం
- నగర సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: ఏడాది కాలంగా నగరంలో 208 కేసుల్లో పట్టుబడిన రూ.7.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీటిని నందిగామ పరిధిలోని బయో మెడికల్ వేస్టు మేనేజ్‌మెంట్ కంపెనీ మల్టీక్లేవ్ ప్రై. లిమిటెడ్‌లో ధ్వంసం చేయనున్నారు. ఈ మేరకు సీసీఎస్ డీసీపీ శ్వేత(CCS DCP Shweta) ఆధ్వర్యంలోని కమిటీ సీజ్ చేసిన డ్రగ్స్‌ను నగర సీపీ సీవీ ఆనంద్ గురువారం గోషామహల్ స్టేడియంలో మీడియాకు చూపించారు.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూకు వీసీ ఉన్నట్టా.. లేనట్టా..
అనంతరం సీపీ మాట్లాడుతూ.. సిటీ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారని, గత మూడేళ్లలో 1200 కేసులు నమోదు చేశామన్నారు. సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను ఎక్కడా వినియోగించకుండా జాగ్రత్తగా భద్రపరిచి చాలా పకడ్భందీగా ధ్వంసం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో 118 కేసుల్లో పట్టుబడ్డ రూ. 3.08కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశామని, ఇప్పుడు ధ్వంసం చేస్తున్న డ్రగ్స్ రెండోసారి అన్నారు. మొత్తం ఈ ఏడాదిలో రూ. 10.58కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నామని సీపీ స్పష్టం చేశారు.
డ్రగ్స్‌పై స్పెషల్ డ్రైవ్..
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి సిటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని, దీనిని నిర్విరామంగా కొనసాగిస్తామని సీపీ ఆనంద్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను కట్టడి చేయడంతో పాటు.. సరఫరా రూట్లపై దృష్టి సారించి డిటెక్ట్ చేస్తున్నామని తెలిపారు. ఫలితంగా కొన్నినెలలుగా డ్రగ్స్ సరఫరా తగ్గుముఖం పట్టిందని సీపీ వివరించారు.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News