Share News

Hyderabad: చింతల్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం.. హత్య

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:57 AM

చింతల్‌(Chintal)లో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. హత్యకు గురైన మహిళ(40) గతంలో గాజుల రామారం(Gajula Ramaram) ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుండేది.

Hyderabad: చింతల్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం.. హత్య

జీడిమెట్ల(హైదరాబాద్): చింతల్‌(Chintal)లో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. హత్యకు గురైన మహిళ(40) గతంలో గాజుల రామారం(Gajula Ramaram) ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుండేది. ఇంటి అద్దె కట్టకపోవడంతో యజమాని ఖాళీ చేయించాడు. దీంతో పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించి, కుత్బుల్లాపూర్‌ చౌరస్తా సమీపంలో పెట్రోల్‌ బంకు ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. నిత్యం చింతల్‌ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగుతుండేది. బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి బండరాయితో మోది హత్య చేసి పారిపోయారు.

ఈ వార్తను కూడా చదవండి: Medaram Jatara: మేడారం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌


city1.2.jpg

జీహెచ్‌ఎంసీ(GHMC) సిబ్బంది చింతల్‌ ప్రధాన రహదారి పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీ(CC footage)ని పరిశీలించారు. సీసీఫుటేజీలో నిందితుల ఫొటోలు సరిగా కనిపించడం లేదు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 06:59 AM