Share News

Hyderabad: హత్యాయత్నం కేసు.. రెండేళ్ల తర్వాత హత్య కేసుగా.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Aug 06 , 2024 | 09:46 AM

రెండేళ్ల క్రితం రూ. 200 విషయమై తలెత్తిన వివాదంలో 15 మంది కలిసి ఓ క్యాబ్‌డ్రైవర్‌(Cabdriver)ను చితకబాదారు. తీవ్రమైన గాయాలతో కోమాలోకి వెళ్లిన ఆ యువకుడు సుదీర్ఘకాలం మృత్యువుతో పోరాడాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడిపై దాడిచేసిన 15మందిపై గతంలో పెట్టిన హత్యాయత్నం కేసును హత్యకేసుగా మార్చినట్లు రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో(Rajendranagar Inspector Castro) మీడియాకు సోమవారం వెల్లడించారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఘర్షణ పడి ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణమయ్యారని తెలిపారు.

Hyderabad: హత్యాయత్నం కేసు.. రెండేళ్ల తర్వాత హత్య కేసుగా.. అసలేం జరిగిందంటే..

- రూ. 200 కోసం జరిగిన ఘర్షణలో గాయపడ్డ యువకుడు

- రెండేళ్లుగా ఆస్పత్రిలో పోరాడి మృతి

హైదరాబాద్: రెండేళ్ల క్రితం రూ. 200 విషయమై తలెత్తిన వివాదంలో 15 మంది కలిసి ఓ క్యాబ్‌డ్రైవర్‌(Cabdriver)ను చితకబాదారు. తీవ్రమైన గాయాలతో కోమాలోకి వెళ్లిన ఆ యువకుడు సుదీర్ఘకాలం మృత్యువుతో పోరాడాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడిపై దాడిచేసిన 15మందిపై గతంలో పెట్టిన హత్యాయత్నం కేసును హత్యకేసుగా మార్చినట్లు రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో(Rajendranagar Inspector Castro) మీడియాకు సోమవారం వెల్లడించారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఘర్షణ పడి ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణమయ్యారని తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: డీజిల్‌ డబ్బులు అధికారులకు.. దోమలతో కష్టాలు ప్రజలకు


2022 జూలై 31.. రాత్రి 11 గంటలకు..

2022 జూలై 31 రాత్రి వెంకటేశ్‌ గౌడ్‌(27)కు చెందిన క్యాబ్‌ ఎక్కిన ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి నిర్ణీత దూరంకన్నా కొంచెం లోపల వరకూ ప్రయాణించాడు. అందుకు రూ. 200లు అదనంగా ఇవ్వాలని వెంకటేశ్‌ అడిగాడు. ఈ విషయమై వివేక్‌రెడ్డికి, క్యాబ్‌ డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వివేక్‌రెడ్డి స్నేహితులను పిలిపించి క్యాబ్‌డ్రైవర్‌ తనతో గొడవ పడటమే కాకుండా బంగారు గొలుసును లాక్కోవాలని చూశాడని చెప్పా డు. తాగిన మైకంలో ఉన్న వివేక్‌రెడ్డి స్నేహితులు డ్రైవర్‌ వెంకటేశ్‌గౌడ్‌ను విచక్షణరహితంగా కొట్టారు. తీవ్రగాయాల పాలైన వెంకటేశ్‌ కోమాలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నిందితులైన వివేక్‌రెడ్డి, వంశిత్‌రెడ్డి అలియాస్‌ వంశీ అలియాస్‌ నాని, చిలుగూరి శ్రావణ్‌ కిరణ్‌రెడ్డి, ఆకాశ్‌రెడ్డి, అయెనాల అంకిత్‌ రెడ్డి అలియాస్‌ లడ్డు, గురజాల మహేందర్‌ గౌడ్‌, జిగురు మనోజ్‌, ఎరాసరాపు శివకుమార్‌, జిగురు అజయ్‌ ముదిరాజ్‌, ఎలకంటి నరేందర్‌, చాకలి శివకుమార్‌, కళ్యాణ మల్లారెడ్డి, గోనె శ్రీకాంత్‌రెడ్డి, మల్లారెడ్డిగారి మణికాంత్‌రెడ్డి, రాగుల వరుణ్‌రెడ్డిల పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న వెంకటేశ్‌ గౌడ్‌ ఆదివారం మృతి చెందాడు. దీంతో తాజాగా పోలీసులు వారిపై హత్య కేసు నమోదు చేశారు.


ఎస్‌ఐ అవుదామనుకొని..

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం, సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంజయ్య గౌడ్‌, వెంకటమ్మలకు నలుగురు ఆడపిల్లల తర్వాత అయిదో సంతానంగా వెంకటేశ్‌ గౌడ్‌ పుట్టాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎస్‌ఐ రాత పరీక్షకు ప్రిపేర్‌ అవుతూ చదువు ఖర్చుల కోసం రాత్రివేళ క్యాబ్‌ డ్రైవర్‌గా చేసేవాడు. ఆరోజు జరిగిన ఘటనతో వెంకటేశ్‌ గౌడ్‌ కలలు కల్లలయ్యాయి. ఆ కుటుంబం చిన్నాభిన్నమైం ది. ఇప్పుడు అతడి మృతితో తల్లిదండ్రులు, తోబుట్టువులు బోరున విలపిస్తున్నారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 10:26 AM