Share News

Hyderabad: తమ్ముడి పథకం.. అన్న అమలు

ABN , Publish Date - Dec 17 , 2024 | 10:23 AM

పనిచేస్తున్న బంగారం షాపు యజమానికి టోకరా వేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. తమ్ముడు పథకం వేసి అన్నకు చెప్పగా అమలు చేశాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. టోలీచౌకిలో గల బ్లూ స్టోన్స్‌ ఆభరణాల షాపులో ఎండీ జహీరుద్దీన్‌ సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.

Hyderabad: తమ్ముడి పథకం.. అన్న అమలు

- బంగారం షాపులో నగల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్: పనిచేస్తున్న బంగారం షాపు యజమానికి టోకరా వేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. తమ్ముడు పథకం వేసి అన్నకు చెప్పగా అమలు చేశాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. టోలీచౌకి(Tolichawki)లో గల బ్లూ స్టోన్స్‌ ఆభరణాల షాపులో ఎండీ జహీరుద్దీన్‌ సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. తాను పనిచేస్తున్న దుకాణానికి కస్టమర్‌గా రావాలని అన్న అజారుద్దీన్‌కు చెప్పాడు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: ప్రభుత్వ భూములను కాపాడాలి: బీజేపీ


అజారుద్దీన్‌ ఆదివారం ఉదయం దుకాణానికి వెళ్లాడు. బంగారు కడియం బ్రాస్‌లెట్‌, గాజులు కావాలని సేల్స్‌మన్‌కు చెప్పాడు. సేల్స్‌మన్‌ నగలు చూపించగా.. అలాంటి డిజైన్లు మరిన్ని కావాలన్నాడు. డిజైన్లు తీసుకురావడానికి సేల్స్‌మన్‌ లోపలికి వెళ్లగానే కౌంటర్‌పై ఉన్న నగలను తీసుకొని అజారుద్దీన్‌ పారిపోయాడు. దుకాణం మేనేజర్‌ అభినవ్‌ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు(Filmnagar Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


city7.2.jpg

సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అజారుద్దీన్‌ షోరూమ్‌లోకి రాగానే జహీరుద్దీన్‌ సైగ చేసిన ఫుటేజీ ఆధారంగా జహీరుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుల నుంచి నగలు స్వాధీనం చేసుకొని అన్నదమ్ములను సోమవారం రిమాండ్‌కు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 10:25 AM