Share News

Hyderabad: ఇద్దరు మహిళల దారుణహత్య..

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:12 AM

ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురైన సంఘటన నగరంలోని మియాపూర్ ఏరియాలో జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ఇద్దరు మహిళల దారుణహత్య..

- మియాపూర్‌లో బ్యాంక్‌ ఉద్యోగి

హైదరాబాద్: మియాపూర్‌ సీబీఆర్‌ ఎస్టేట్‌(Miyapur CBR Estate)లో వివాహిత దారుణహత్యకు గురైంది. ఇన్‌స్పెక్టర్‌ దుర్గా రామలింగ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్పందన (29) ఓ ప్రైవేటు బ్యాంక్‌ ఉద్యోగి. భర్త వినయ్‌కుమార్‌ ప్రముఖ చికెన్‌ సెంటర్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. వీరికి 2022లో వివాహమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ విడిగా ఉంటున్నారు. స్పందన సీబీఆర్‌ ఎస్టేట్స్‌ 110 ప్లాట్స్‌లో నివాసం ఉంటోంది. తల్లి, కుటుంబసభ్యులు పక్కపక్కనే ఉండటంతో నిత్యం తాళం వేసి అక్కడే ఓచోట పెడతారు.

ఇదికూడా చదవండి: Breaking News: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ


ఆదివారం రాత్రి కూడా ఆమె పడుకొని ఉండగా కుటుంబసభ్యుల్లో ఒకరు బయట నుంచి తాళం వేసి వెళ్లారు. సోమవారం సాయంత్రం స్పందన తల్లి వచ్చి తాళం తెరిచి చూడగ ఆమె హత్యకు గురై రక్తం మడుగులో పడి ఉంది. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వివరాలు ఆరా తీశారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటం, ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు నడుస్తున్న నేపథ్యంలో భర్తగానీ, అతని తరఫున ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గానీ వచ్చి తమ కుమార్తెను హత్యచేసి ఉంటారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


ఇంటి తాళం చెవి దాస్తున్న విషయాన్ని ముందే గుర్తించిన దుండగులు స్పందన ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంటిపక్కన కుటుంబసభ్యులు లేని సమయం చూసుకొని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్‌టీమ్‌ ద్వారా వివరాలు సేకరించడంతో పాటు.. అపార్టుమెంట్‌, స్థానిక వీధిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


ఎల్లారెడ్డిగూడలో ఆర్‌ఎంపీ భార్య..

- గొంతుకోసి చంపిన దుండగులు

హైదరాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయకాలనీలో నివాసం ఉండే ఉమామహేశ్వరరావు ఆర్‌ఎంపీ. ఎల్లారెడ్డిగూడ దేవాలయం పక్కన అమ్మ క్లినిక్‌ పేరిట కొంతకాలంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. నవోదయకాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 36 రెండోఅంతస్తులో భార్య సుధారాణి(44), పిల్లలతో కలిసి ఉంటోంది.


కుమార్తె రుద్రారాణి 8 వ తరగతి చదువుతుండగా, కుమారుడు శ్రీకర్‌చంద్ర 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చి పక్క వీధిలో ట్యూషన్‌కు వెళ్లారు. భర్త ఉమామహేశ్వరరావు క్లినిక్‌కి వెళ్లాడు. పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పక్క ఫ్లాట్‌ వాళ్లకు చెప్పి, అనంతరం తండ్రికి ఫోన్‌ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా సుధారాణి అప్పటికే మరణించి ఉంది. కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు గుర్తించారు.


..............................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................

Hyderabad: హృదయం ‘సిగ్నల్‌’లో ఉంది..

city2.jpg

హైదరాబాద్‌ సిటీ: మీరు వాహనం డ్రైవ్‌ చేస్తూ వెళ్తుండగా, రెడ్‌ సిగ్నల్‌(Red signal) పడిందా? ఒక్కసారి దాన్ని పరిశీలించండి. అందులో మీ హృదయం కనిపిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? గుండె సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు స్టార్‌ ఆస్పత్రి, ట్రాఫిక్‌ పోలీసు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ(GHMC, HMDA) సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. జంక్షన్లలో రెడ్‌ సిగ్నల్‌ స్థానంలో గుండె ఆకారంలో లైట్లు వచ్చేలా ఏర్పాట్లు చేశాయి. వరల్డ్‌ హార్ట్‌డే సందర్భంగా సైబరాబాద్‌ పోలీసుస్టేషన్‌(Cyberabad Police Station) పరిధిలో ప్రయోగాత్మకంగా ఐదుచోట్ల ఈ లైటింగ్‌ను ప్రారంభించిన అధికారులు ఇప్పుడు వంద కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఈనెల 15వ తేదీ వరకు ఆయా జంక్షన్లలో గుండె ఆకారంలో రెడ్‌ సిగ్నళ్లు కనిపించనున్నాయి

city2.2.jpg


ఇదికూడా చదవండి: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ఇదికూడా చదవండి: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి

ఇదికూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే

ఇదికూడా చదవండి: ఉపఎన్నికపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2024 | 11:13 AM