Hyderabad: కొత్త మలుపు తిరిగిన వ్యాపారి హత్య కేసు.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:48 PM
అప్పు ఇచ్చిన వ్యాపారిని హత మార్చిన కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాపారిని నలుగురు కలిసి హత్య చేసి ఒక్కడే వచ్చి లొంగిపోయినట్లు తెలుస్తుంది. వడ్డీ వ్యాపారి వేధింపులతో విసిగిపోయిన నలుగురు కలిసి పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది.
- నలుగురు కలిసి చంపారు.. ఒక్కరు లొంగిపోయారు
- పోలీసుల విచారణలో వెల్లడైన కొత్త విషయాలు
హైదరాబాద్: అప్పు ఇచ్చిన వ్యాపారిని హతమార్చిన కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాపారిని నలుగురు కలిసి హత్య చేసి ఒక్కడే వచ్చి లొంగిపోయినట్లు తెలుస్తుంది. వడ్డీ వ్యాపారి వేధింపులతో విసిగిపోయిన నలుగురు కలిసి పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది. నలుగురిలో ఒకరు వ్యాపారికి దూరం బంధువు వరుసకు (బావమర్ధి) అవుతారు. సదరు వ్యక్తికి చెందిన ఓ వ్యాపార సముదాయాన్ని మృతుడు కాశీరావు అప్పు కిందకు రాయించుకున్నట్లు సమాచారం.
ఈ వార్తను కూడా చదవండి: గంజాయి, డ్రగ్స్‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
వ్యాపారిని హత్య చేసిన తరువాత శేఖర్‌గౌడ్(Shekhar Goud) ఒక్కరే వచ్చి హయత్‌నగర్(Hayatnagar) పోలీసులకు లొంగిపోయాడు. అందరు అదే నిజమని భావించారు. శేఖర్‌గౌడ్‌తో పాటు గదిలో ఉండే శంకర్, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించగా అసలు నిజం బయట పడినట్లు తెలుస్తుంది. హయత్‌నగర్ బొమ్మలగుడి వద్ద గల సాయి ఫుడ్ కోర్టును కూడా కాశీరావే పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. అందులోనే శంకర్, సాయిలు పని చేస్తున్నారు.
మంగళవారం ఉదయం కారులో సదరు వ్యాపారి బంధువు ఇంటికి వచ్చినట్లు స్థానికులు గుర్తించారు. నలుగురు పైన ఉండగానే కాశీరావు అక్కడికి వెళ్లి ఉంటాడు. దీంతో వడ్డీ కోసం వేధించే కాశీరావును హతమార్చాలని నిర్ణయించుకుని హత్య చేసినట్లు తెలుస్తుంది. బలంగా ఉన్న కాశీరావును ఒక్క శేఖర్‌గౌడ్ హత్య చేశాడంటే నమ్మలేక పోయారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు పట్టుకోగా శేఖర్‌గౌడ్ సర్జికల్ బ్లెడుతో దాడి చేసి ఉంటాడని తెలుస్తుంది. పోస్టుమార్టం రిపోర్టులో సైతం బ్లేడు కాశీరావు గొంతులో ఇరుకుని ఉండడంతో డాక్టర్లు తొలగించారు.
బలంగా గొంతు కోయడం వల్లనే తుప్పు పట్టిన బ్లేడు గొంతులో ఇరుకుని ఉంటుంది. పోలీస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే గదిలో ఉండే మరో ఇద్దరిపైన పోలీసులకు అనుమానం కలిగింది. హత్యలో కాశీరావు బంధువు ఉంటాడని ఎవరు ఊహించలేక పోయారు. కాశీరావు చనిపోయిన తరువాత శేఖర్‌గౌడ్‌ను పోలీసులకు లొంగిపోమ్మని చెప్పిన ముగ్గురు పారిపోయారు. బయట ఉండి అన్ని తాము చూసుకుంటామని చెప్పి శేఖర్‌గౌడ్ లొంగిపోయాలా చేశారు. ఆ తరువాత పోలీసులు విచారణలో భాగంగా శేఖర్‌గౌడ్‌తో పాటు గదిలో ఉండే శంకర్, సాయిలను తీసుకుని వచ్చి విచారిస్తే అసలు విషయం బయట పడినట్లు తెలుస్తుంది.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News