Share News

Hyderabad: బుల్లితెర నటికి వేధింపులు.. వ్యక్తిపై కేసు

ABN , Publish Date - Dec 31 , 2024 | 08:43 AM

రోజూ ఫోన్‌చేసి, అసభ్యకరంగా మేసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాకు చెందిన మహిళ సీరియల్స్‌లో నటిస్తున్నది. 2012లో ఆమెకు వివాహం కాగా, కుమార్తె, కుమారుడు పుట్టిన తర్వాత పిల్లలతో కలిసి భర్తకు దూరంగా యూసుఫ్‏గూడ కృష్ణానగర్‌(Yusufguda Krishnanagar)లో నివాసముంటుంది.

Hyderabad: బుల్లితెర నటికి వేధింపులు.. వ్యక్తిపై కేసు

హైదరాబాద్: రోజూ ఫోన్‌చేసి, అసభ్యకరంగా మేసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాకు చెందిన మహిళ సీరియల్స్‌లో నటిస్తున్నది. 2012లో ఆమెకు వివాహం కాగా, కుమార్తె, కుమారుడు పుట్టిన తర్వాత పిల్లలతో కలిసి భర్తకు దూరంగా యూసుఫ్‏గూడ కృష్ణానగర్‌(Yusufguda Krishnanagar)లో నివాసముంటుంది. ఈ యేడాది సెప్టెంబర్‌ లో శ్రావణసంధ్య సీరియల్‌(Shravan Sandhya Serial)లో నటిస్తుండగా బత్తుల ఫణితేజ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మన హైదరాబాద్ బాగా డవలప్ అయ్యింది బాస్.. ఏం జరిగిందో తెలిస్తే..


city5.3.jpg

కొద్ది కాలానికి ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా నిరాకరించింది. తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడి వేధింపులకు పాల్పడుతున్నాడు. షూటింగ్‌ లో తాను ఇతర సినీనటులతో దిగిన ఫొటోలను బ్యానర్ల కిందవేసి సంక్రాంతికి మీ సొంత ఊర్లో కడతానని బెదిరించాడు. రోజుకు వందకుపైగా ఫోన్‌కాల్స్‌, వందలకుపైగా అసభ్యకరమైన మెస్సెజ్‌లు పెడుతూ వేధించసాగాడు. బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. ఫణితేజపై 75(2),78(2), 79,351(2) బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి

ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2024 | 08:43 AM