Share News

Hyderabad: బిత్తిరి సత్తిపై సీసీఎస్‌లో కేసు నమోదు

ABN , Publish Date - Aug 29 , 2024 | 11:41 AM

బిత్తిరి సత్తి(Bittiri satti) అలియాస్‌ కావలి రవికుమార్‌పై సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌లో కేసు నమోదైంది. రాష్ట్రీయ వానరసేన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ మద్య బిత్తిరిసత్తి బిల్లుగీత పేరుతో ఘంటసాల ఆలపించిన భగవద్గీతను అనుకరిస్తూ ఓ పేరడీ చేసాడు.

Hyderabad: బిత్తిరి సత్తిపై సీసీఎస్‌లో కేసు నమోదు

- భగవద్గీతను అవమానించడంపై రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్): బిత్తిరి సత్తి(Bittiri satti) అలియాస్‌ కావలి రవికుమార్‌పై సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌లో కేసు నమోదైంది. రాష్ట్రీయ వానరసేన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ మద్య బిత్తిరిసత్తి బిల్లుగీత పేరుతో ఘంటసాల ఆలపించిన భగవద్గీతను అనుకరిస్తూ ఓ పేరడీ చేసాడు. అయితే అది అసభ్యకరంగా ఉందని, హిందువులకు పవిత్రమైన భగవద్గీతను సత్తి అవమానించాడని వానరసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కోరింది. క్షమాపణలు చెప్పడానికి బిత్తిరిసత్తి నిరాకరించడంతో వానరసేన ప్రతినిధులు సైబర్‌క్రైమ్స్‌(Cybercrimes)లో ఫిర్యాదుచేసారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మరోసారి ఫిర్యాదుచేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసారు.


.................................................

ఈ వార్తను కూడా చదవండి:

..................................................

Hyderabad: ఎవరు సార్‌ యూజ్‌లెస్‌ఫెలో ?

- ఉన్నతాధికారిపై ఎదురుతిరిగిన కానిస్టేబుల్‌

యూసుఫ్‌గూడ(హైదరాబాద్): ఆ పోలీసు కానిస్టేబుల్‌(Police Constable)లో ఉన్నతాధికారి పట్ల అప్పటిదాకా ఉన్న భయం పోయి.. ఎక్కడలేని ధైర్యం ఆవహించేసింది. డ్యూటీలో తన ఆలస్యానికి గల కారణాన్ని అర్థం చేసుకోకుండా అనవసరంగా యూజ్‌లెస్‌ ఫెలో(Useless fellow) అంటూ తనపై నోరు పారేసుకున్నారనే ఆవేదనతో ఎదురు తిరిగి గట్టిగా ప్రశ్నించాడు. బుధవారం పశ్చిమ మండలంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం రోల్‌కాల్‌(Roll call) కోసం ఉదయం 10:30 గంటలకు ఉన్నతాధికారి స్టేషన్‌కు వస్తున్నారంటూ ముందుగానే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


city5.jpg

అదే సమయానికి సదరు ఉన్నతాధికారి వచ్చారు. ఒక్కరు తప్ప పోలీస్‌ స్టేషన్‌లోని సిబ్బంది అంతా వచ్చారు. ఆలస్యంగా వచ్చిన ఆ ఒక్కరు అక్కడ పనిచేసే కానిస్టేబుల్‌ ! నిండు గర్భిణి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. అక్కడ ఆమెకు ప్రసవం జరిగే దాకా ఉండటంతో 15-20 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అంతే.. ఆ కానిస్టేబుల్‌(Constable)పై సదరు ఉన్నతాధికారి ఇంతెత్తున లేచారు. డ్యూటీ అంటే అంత చులకనా? బాధ్యత లేదా? రోల్‌కాల్‌కే ఆలస్యంగా వచ్చావు.. అసలు డ్యూటీ సరిగా చేస్తున్నావా? ఎందుకూ పనికిరారు.. యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అని ఆవేశంతో ఊగిపోయారు.


దానికి ఆ కానిస్టేబుల్‌... నా భార్య పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాను.. కొంత ఆలస్యమైంది అని వివరణ ఇచ్చాడు. అప్పటికీ కోపం తగ్గని ఆ అధికారి.. ‘ఇలాంటి పనికిమాలిన సాకులు చెబుతూనే ఉంటారు.. కనీస బాధ్యత అనేదే లేకుండా’’ అని తీవ్ర స్వరంతో అన్నారు. కాసేపు అక్కడే మౌనంగా ఉండిపోయిన కానిస్టేబుల్‌, లోపలికి వెళ్లి యూనిఫామ్‌ వేసుకొని బయటకొచ్చి.. ఆ ఉన్నతాధికారి ఎదుట నిలబడ్డాడు. ‘ నా భార్యను నేను కాకపోతే ఎవరు సార్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేది?’ అని ఆవేదనాపూరిత స్వరంతో కాస్త గట్టిగానే నిలదీశాడు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2024 | 11:41 AM