Share News

Hyderabad: 27 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చిన్నారి మృతి

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:52 AM

దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎస్‌హెచ్‌వో రవికుమార్‌(SHO Ravikumar) తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచర్లపల్లి వెంకట్‌రెడ్డినగర్‌(Chinnacherlapalli Venkat Reddy Nagar)లో ఉంటున్న సాయికుమార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లోని తన కారులో క్యాన్‌లో తెచ్చిన పెట్రోల్‌ను పోస్తుండగా కిందపడింది.

Hyderabad: 27 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చిన్నారి మృతి

హైదరాబాద్: దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎస్‌హెచ్‌వో రవికుమార్‌(SHO Ravikumar) తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచర్లపల్లి వెంకట్‌రెడ్డినగర్‌(Chinnacherlapalli Venkat Reddy Nagar)లో ఉంటున్న సాయికుమార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లోని తన కారులో క్యాన్‌లో తెచ్చిన పెట్రోల్‌ను పోస్తుండగా కిందపడింది. ఈ నెల 1న దీపావళి పండుగకు ఇంటి ముందు వెలిగించిన దీపాలకు పెట్రోల్‌ అంటుకొని మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

ఈ వార్తను కూడా చదవండి: HYDRA: మళ్లీ రంగంలోకి ‘హైడ్రా’.. ఫిర్యాదుల నేపథ్యంలో చెరువుల పరిశీలన


ఈ ఘటనలో ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బాలిక యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండురోజుల తర్వాత మృతిచెందింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాంబాబు కుమార్తె జస్మిత(4) అప్పటి నుంచి నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. ప్రమాదానికి కారణమైన ఇంటి యజమానిని రిమాండ్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రవికుమార్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 07:52 AM