Hyderabad: యూకే నుంచి వచ్చి.. మృత్యుఒడికి చేరి
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:19 PM
ఉన్నత విద్యాభ్యాసం కోసం కుమారుడిని ఇతర దేశానికి పంపించారు.. జీవితంలో స్థిరపడి తమ కలలను సాకారం చేస్తాడని తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన శనివారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్(Petbashirabad Police Station) పరిధిలో జరిగింది.
- యువకుడిని బలిగొన్న అతివేగం
జీడిమెట్ల(హైదరాబాద్): ఉన్నత విద్యాభ్యాసం కోసం కుమారుడిని ఇతర దేశానికి పంపించారు.. జీవితంలో స్థిరపడి తమ కలలను సాకారం చేస్తాడని తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన శనివారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్(Petbashirabad Police Station) పరిధిలో జరిగింది. గాయత్రీనగర్ ప్రాంతంలోని ఓంసాయి కాలనీకి చెందిన అన్నవరం మహిపాల్‌రెడ్డి కుమారుడు సాయికృష్ణారెడ్డి(24) ఉన్నత చదువుల కోసం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లాడు.
ఈ వార్తను కూడా చదవండి: Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఇటీవల తల్లిదండ్రులను చూడటానికి నగరానికి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున సాయికృష్ణారెడ్డి(Saikrishna Reddy) తన బైక్‌పై వేగంగా అల్వాల్ వైపు వెళ్తుండగా వెన్నెలగడ్డ పోచమ్మ ఆలయం వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: గ్రేటర్లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్
ఈవార్తను కూడా చదవండి: Rahul Gandhi: 5న రాష్ట్రానికి రాహుల్
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మార్ట్‌లో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం
ఈవార్తను కూడా చదవండి: TG Govt: హోటళ్లను బట్టి ఫుడ్ ఇన్స్పెక్టరు
Read Latest Telangana News and National News