Hyderabad: బతుకుదెరువు కోసం వచ్చి.. హెరాయిన్ విక్రయిస్తూ..
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:18 PM
బ్రౌన్ హెరాయిన్(Brown heroin) విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మొగల్‌పురా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- 50 గ్రాముల సరుకు స్వాధీనం
- ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: బ్రౌన్ హెరాయిన్(Brown heroin) విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు, వినియోగదారుడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మొగల్‌పురా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన జమాల్ మోమిన్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మొగల్‌పురా(Mogalpura) పరిధిలో నివసిస్తూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మేస్త్రీ పని ద్వారా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో బ్రౌన్ హెరాయిన్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కొత్త మలుపు తిరిగిన వ్యాపారి హత్య కేసు.. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్(Hyderabad)లో డ్రగ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బెంగాల్ నుంచి హెరాయిన్‌ను తీసుకొచ్చి మీర్‌చౌక్ ప్రాంతానికి చెందిన స్నేహితుడు షేక్ షాబాజ్‌తో కలిసి అవసరమైన కస్టమర్స్‌కు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు నిందితులతోపాటు.. వినియోగదారుడు సయ్యద్ అబ్ధుల్ మాజిద్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News