Share News

Hyderabad: ధూల్‌పేట్‌ మహిళా డాన్‌ అంగూరిబాయి అరెస్ట్‌..

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:11 PM

ధూల్‌పేట్‌(Dhoolpet)లో గంజాయి డాన్‌గా పేరొందిన అంగూరి బాయ్‌ అలియాస్‌ అరుణాబాయ్‌ను ఎస్‌టీఎఫ్‌, ఎక్సైజ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. 15 కేసుల్లో జైలుకెళ్లొచ్చిన అంగూరి భాయ్‌ మరో 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ధూల్‌పేట్‌ మహిళా డాన్‌ అంగూరిబాయి అరెస్ట్‌..

- గంజాయి అమ్మకాల్లో దిట్ట

- అరెస్ట్‌ చేసిన పోలీసులపై దాడులు

- తరచూ మకాం మారుస్తూ తప్పించుకుంటున్న వైనం

- 15 కేసుల్లో జైలుకు.. తాజాగా మరోసారి అరెస్ట్‌

హైదరాబాద్: ధూల్‌పేట్‌(Dhoolpet)లో గంజాయి డాన్‌గా పేరొందిన అంగూరి బాయ్‌ అలియాస్‌ అరుణాబాయ్‌ను ఎస్‌టీఎఫ్‌, ఎక్సైజ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. 15 కేసుల్లో జైలుకెళ్లొచ్చిన అంగూరి భాయ్‌ మరో 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పేరొందిన అంగూరి బాయ్‌ అలియాస్‌ అరుణాబాయ్‌ నగరంలోని ఆరాంఘర్‌ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని తన ఇంట్లో దాదాపు 20 నుంచి 25మందితో గ్యాంగ్‌ నడుపుతూ గంజాయి అమ్మకాలు సాగిస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Tirupati: తిరుమలలో అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలి


గత మూడేళ్ల క్రితం గంజాయి అమ్మకాలు సాగిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా అప్పటి ధూల్‌పేట్‌ ఏఈఎస్‌నవీన్‌ కుమార్‌కు పట్టుపడింది. అయితే, అర్ధరాత్రి ఎక్సైజ్‌ స్టేషన్‌పై దాడి చేయించి అరెస్ట్‌ అయిన వారిని ఆమె తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి 24 గంటల్లో అందరినీ అరెస్ట్‌ చేశారు. నాటినుంచి తన మకాంను ఆమె ఆరాంఘర్‌కు మార్చి గంజాయి అమ్మకాలు సాగిస్తోంది. ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌, మంగళ్‌హాట్‌తోపాటు నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఆమెపై నమోదైన 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతున్నది.


city8.2.jpg

అంతకుముందు 15 కేసుల్లో జైలుకు సైతం వెళ్లి వచ్చింది. గ్యాంగ్‌లో కీలకంగా వ్యహరించే మరో మహిళపై దాదాపు 20 కేసుల వరకు ఉన్నాయి. కొంతకాలంగా ఆమె ఎక్సైజ్‌ పోలీసుల కళ్లు గప్పి తన స్థావరాన్ని తరచూ మారుస్తూ వచ్చింది. దీంతో ఎస్‌టీఎఫ్‌, ఎక్సైజ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కార్వాన్‌ ప్రాంతంలో అంగూరి బాయి ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకాల్లో డాన్‌గా పేరొందిన మహిళను అరెస్ట్‌ చేసినట్లైంది.


ఆమె తీరే వేరు...

గంజాయి కేసులో అరెస్ట్‌ అయి గతంలో జైలుకెళ్లిన అంగూరి బాయి అక్కడి నేరస్థుల పరిచయాలతో బయటకు వచ్చిన తర్వాత ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌(Odisha, Andhra Pradesh)లలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తెప్పించి హోల్‌సేల్‌లో విక్రయించేది. జైలుకు వెళ్లిన ప్రతిసారీ ఆమె వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ వచ్చిందని స్థానికంగా పరిచయం ఉన్న వారు చెబుతున్నారు.


గతంలో ఎక్సైజ్‌ పోలీసులు అంగూరి బాయిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారుల బదిలీ కారణంగా మధ్యలోనే నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను మరోమారు పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకాలను అరికట్టినట్లైందని స్థానికులంటున్నారు. అంగూరి బాయిని అరెస్ట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి ప్రత్యేంగా అభినందించారు.


ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2024 | 12:11 PM