Share News

Hyderabad: పీడీయాక్ట్‌ ప్రయోగించినా తిరిగి అదే దందా..

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:42 AM

ఏపీ, పశ్చిమబెంగాల్‌, త్రిపుర(AP, West Bengal, Tripura) ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన సూర్యకుమారి(38), తిరుపతికి చెందిన కె.విజయశేఖర్‌రెడ్డి(49) వ్యభిచారం నిర్వహించడమే దందాగా పెట్టుకున్నారు.

Hyderabad: పీడీయాక్ట్‌ ప్రయోగించినా తిరిగి అదే దందా..

- ఘరానా వ్యభిచార ముఠా అరెస్ట్‌

- ఆరుగురు యువతులను కాపాడిన టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ సిటీ: ఏపీ, పశ్చిమబెంగాల్‌, త్రిపుర(AP, West Bengal, Tripura) ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన సూర్యకుమారి(38), తిరుపతికి చెందిన కె.విజయశేఖర్‌రెడ్డి(49) వ్యభిచారం నిర్వహించడమే దందాగా పెట్టుకున్నారు. పేర్లు మార్చుకుంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న సూర్యకుమారి అలియాస్‌ వర్ష అలియాస్‌ ముడిసి సూర్యకుమారి అలియాస్‌ అంజలి అలియాస్‌ దాసరి అంజలి అలియాస్‌ చిట్టి అలియాస్‌ కుమారి అలియాస్‌ రాణి అలియాస్‌ పల్లవి, అలియాస్‌ లక్ష్మిపై 16 కేసులు నమోదయ్యాయి. ఆమెపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్‌(PD Act) కూడా ప్రయోగించారు. కానీ, తీరుమార్చుకోని సూర్య కుమారి అమీర్‌పేటలో ఉంటున్న విజయశేఖర్‌రెడ్డితో కలిసి దందా ప్రారంభించింది. సబ్‌ ఆర్గనైజర్లు పశ్చిమబెంగాల్‌ 24 పరగణాకు చెందిన ఆర్కోజిత్‌ ముఖర్జీ(30), తిరుపతికి చెందిన వేణుగోపాల్‌ బాలాజీ(50) సహకారంతో ఏపీ, పశ్చిమబెంగాల్‌, త్రిపురకు చెందిన యువతులను నగరానికి రప్పించేవారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హరీష్‏రావును జైలుకు పంపించే వరకు ఉద్యమం..


city2.2.jpg

విజయశేఖర్‌రెడ్డి తనకున్న నెట్‌వర్క్‌ ద్వారా కస్టమర్లకు యువతుల ఫొటోలు పంపేవాడు. వారి కోరిక మేరకు యువతులను ఆయా ప్రాంతాలకు, లాడ్జిలకు పంపేవాడు. సూర్యకుమారి పలు మార్గాల్లో కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోవడం, ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవహారాలను చూసుకునేది. పక్కా సమాచారమందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పంజాగుట్ట పార్క్‌ హోటల్‌లో కస్టమర్‌ కృతితేజతోపాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆరుగురు యువతులను కాపాడారు. ప్రధాన నిర్వాహకులు సూర్యకుమారి, విజయశేఖర్‌రెడ్డితోపాటు సబ్‌ ఆర్గనైజర్‌లు ఆర్కోజిత్‌ ముఖర్జీ, వేణుగోపాల్‌ బాలాజీలతోపాటు కృతితేజను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 89,500, రెండు కార్లు, మూడు బైక్‌లు, 18 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్ లు, 2 ట్యాబ్‌లు, వివిధ బ్యాంక్‌లకు చెందిన 45 క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, 5 సిమ్‌కార్డులు, 25 ఆధార్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 11:42 AM