Share News

Hyderabad: హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ ఆవరణలో పేలుడు

ABN , Publish Date - Dec 07 , 2024 | 07:26 AM

హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Hayatnagar Police Station) ఆవరణలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించింది. ఓ మహిళ గాయపడింది. సూర్యకళ (35) జీఎంఆర్‌ ఐట్‌సోర్సింగ్‌ విభాగంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.

Hyderabad: హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ ఆవరణలో పేలుడు

- మహిళకు గాయాలు

హైదరాబాద్: హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Hayatnagar Police Station) ఆవరణలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించింది. ఓ మహిళ గాయపడింది. సూర్యకళ (35) జీఎంఆర్‌ ఐట్‌సోర్సింగ్‌ విభాగంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. హయత్‌నగర్‌ పోలీసులు జప్తు చేసిన వస్తువులను భద్రపరిచేందుకు జాతీయ రహదారిని ఆనుకొని ఓ పక్కన రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. దాని వెనుక చెత్త పేరుకుపోవడంతో శుభ్రం చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద అగ్నిప్రమాదం


సూర్యకళ చెత్తను ఊడ్చి కుప్పగా పోసి నిప్పుపెట్టింది. క్షణాల్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆమె గాయపడింది. ఎడమ కంటికి తీవ్రమైన గాయమైంది. స్టేషన్‌లో ఉన్న పోలీసులు బయటకు పరుగులు తీశారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సీఐ నాగరాజుగౌడ్‌(CI Nagarajugow) తెలిపారు.


రేకుల షెడ్డు వెనుకాల పెద్ద టేకు చెట్టు ఉంది. ఆకులు, చెత్తాచెదారం అక్కడ పేరుకుపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారు, పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే వారు కూల్‌డ్రింక్స్‌ డబ్బాలు, ఖాళీ సీసాలు, ఇతర వ్యర్థాలను అక్కడ వేస్తుంటారు. మంట వేడికి అవి పేలాయా, లేక దీపావళి సమయంలో చెత్తను ఊడ్చి అందులో వేయడం వల్ల పేలని టపాసులు పేలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు డాగ్‌, బాంబు స్క్వాడ్‌ను రప్పించారు. పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ కాశీరెడ్డి సందర్శించారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 07:26 AM