Hyderabad: నకిలీ ఆర్టీఓ గుట్టు రట్టు
ABN , Publish Date - Nov 22 , 2024 | 07:23 AM
ఓ వ్యక్తి నకిలీ ఆర్టీఓ అవతారమెత్తాడు. ఆర్టీఏ అధికారులు తనకు చలానా విధించి ఇబ్బందులు పెడుతారా, ఇక చూడండి మీ సంగతి చెబుతానంటూ ఓ చలానా బాధితుడు ఏకంగా ఆర్టీఓ అవతారమెత్తాడు.
- ఆర్టీఓగా చలామణి అవుతూ అక్రమ వసూళ్లు
- పోలీసులకు పట్టించిన మిల్లర్ వాహన యజమానులు
హైదరాబాద్: ఆర్టీఏ(RTA) అధికారులు తనకు చలానా విధించి ఇబ్బందులు పెడుతారా, ఇక చూడండి మీ సంగతి చెబుతానంటూ ఓ చలానా బాధితుడు ఏకంగా ఆర్టీఓ అవతారమెత్తాడు. కొంత కాలంగా ఆర్టీఓగా చలామణి అవుతూ రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న అతన్ని ఎట్టకేలకు వాహన యజమానులు నకిలీ ఆర్టీఓగా గుర్తించారు. గురువారం ఉప్పల్ నల్ల చెరువుకట్టపై వసూళ్లకు పాల్పడుతున్న ఆ నకిలీ ఆర్టీఓ పాశం ప్రేమ్‌కుమార్‌ని ఉప్పల్ పోలీసులకు పట్టించారు. అతన్ని ఉప్పల్ పోలీస్‌స్టేషన్(Uppal Police Station)కు తరలించి విచారించడంతో అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
ఉప్పల్ ఎస్సై మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ హనుమసాయికాలనీలో నివాసముండే పాశం ప్రేమ్‌కుమార్‌రెడ్డి(45) ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద సామిల్ నిర్వహిస్తున్నాడు. గతంలో అతను వాహనంపై వెళ్తుండగా ఆర్టీఏ అధికారులు నిబంధనల పాపటించడం లేదంటూ తన వాహనానికి చలానా విధించారు. ఆ చలానానే ఆక్రమార్జనకు ఆయుధంగా మలుచుకున్న ప్రేమ్‌కుమార్‌రెడ్డి(Premkumar Reddy) చలానా బుక్కులను ముద్రించాడు.
తన వద్ద ఉన్న కారునే అధికారిక వాహనంగా స్టిక్కర్లు వేసి తనకు తెలిసిన వ్యక్తితో కలిసి తాను ఆర్టీఓ అధికారిని అంటూ రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ వసూళ్ళ పర్వానికి తెరలేపాడు. మిల్లర్ యంత్రాలను తీసుకెళ్ళే వాహనాలను టార్గెట్ చేసుకొని ఓవర్‌లోడ్ తీసుకెళ్తున్నారంటూ బెదిరించాడు. అడిగినంత ఇవ్వకుంటే లక్షల్లో చలానా రాస్తానంటూ ఒక్కొక్క వాహనయజమాని నుంచి రూ. 2వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశాడు.
ఇలా గత రెండు నెలలుగా ఉప్పల్, ఉప్పల్ డిపో, మేడిపల్లి, చెంగిచెర్ల, నాగోల్(Uppal, Uppal Depot, Medipalli, Chengicherla, Nagole) ప్రాంతాల్లో రోడ్లపై లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే, తన వాహనానికి చలానా విధించడంతో తాను కూడా ఆర్టీఓ అధికారిగా మారి వసూలు చేయాలనే ఆలోచన వచ్చిందని విచారణలో నిందితుడు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మిల్లర్ యంత్రాల యజమానులు ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ వద్ద ఎంత తీసుకున్నది తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రేహకుమార్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News