Hyderabad: తండ్రీ కొడుకులే సూత్రధారులు.. బోయిన్‌పల్లి యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:43 AM
యువకుడి హత్య కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. తండ్రీకొడుకులే సూత్రధారులని నిర్ధారించి వారిని అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు.
- కుమార్తె ప్రేమ వివాహం ఇష్టంలేక ఘాతుకం
- ఐదుగురు నిందితుల అరెస్ట్
బోయిన్‌పల్లి(హైదరాబాద్): యువకుడి హత్య కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. తండ్రీకొడుకులే సూత్రధారులని నిర్ధారించి వారిని అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన మహ్మద్ సమీర్(21) సాదుల ఎస్టేట్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అహ్మద్ వద్ద భవన నిర్మాణంలో భాగంగా వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు.
ఈ వార్తను కూడా చదవండి: జనవరి 31లోగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: విద్యాశాఖ
ఈ క్రమంలో అతడి చిన్న కుమార్తె ఫిర్దోస్ సాదాఫ్ను సమీర్ ప్రేమించాడు. ఈ ఏడాది జనవరి 10న బెంగళూరు(Bangalore)లో పెళ్లి చేసుకొని కొద్ది రోజులు అసోంలో ఉన్నారు. అమ్మాయి కుటుంబం నాచారానికి వెళ్లిపోయారు. ఆరు నెలల తర్వాత సాదాఫ్, సమీర్ తిరిగి బోయిన్‌పల్లిలోని హర్షవర్ధన్ కాలనీ సమీపంలోగల సమీర్ ఇంటికి వచ్చారు. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు పెద్దమనుషులతో కలిసి సమీర్ ఇంటికి వెళ్లారు.
అందరికి తెలిసేలా వివాహం జరిపిస్తామని నమ్మించి కుమార్తెను తమ ఇంటికి తీసుకెళ్లారు. తమ వద్ద పనిచేస్తున్న సమీర్ తన కుమార్తెను వివాహం చేసుకోవడంతో మహ్మద్ షబ్బీర్ అహ్మద్, అతడి కుమారుడు మహ్మద్ ఉమేర్ కక్ష పెంచుకున్నారు. తన కుమార్తెకు విడాకులు ఇవ్వాలని పలుమార్లు సమీర్‌కు చెప్పగా అతడు అంగీకరించలేదు. సాదా్‌ఫకు మరో వివాహం చేయాలనుకుంటే సమీర్ అడ్డుపడుతుండడంతో అతడిని అడ్డు తొలగించుకోవడానికి హత్య పథకం రూపొందించారు.
ఈ క్రమంలో వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పది నేరాల్లో నిందితుడు, రౌడీషీటర్ అబ్దుల్ మతిన్(25), బాలాపూర్‌కు చెందిన మరో రౌడీషీటర్ సయ్యద్ సోహెల్(25), బాలాపూర్‌కు చెందిన షేక్ అబూబకర్ సిద్దిక్, ఇబ్రహీంతో కలిసి ఈనెల 21వ తేదీ రాత్రి సమీర్ ఇంటి వద్ద స్నేహితులతో మాట్లాడుతుండగా కత్తులు, సర్జికల్ బ్లేడ్‌లతో దాడిచేసి చంపేసి పారిపోయారు. మృతుడి తల్లిదండ్రులు, స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తండ్రీకొడుకులు నిజామాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులను అరెస్ట్ చేశామని, ఇబ్రహీం పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు మూడు కత్తులు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, డీఐ సర్దార్ నాయక్, ఎస్‌ఐలు నాగేంద్రబాబు, శివశంకర్, గిరిధర్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..
ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Read Latest Telangana News and National News