Share News

Hyderabad: కలశం పేరిట కపటం..

ABN , Publish Date - Oct 10 , 2024 | 10:23 AM

ఎన్నో శక్తులున్న రైస్‌ పుల్లింగ్‌ కలశం తమవద్ద ఉన్నదని, అమ్మితే భారీగా లాభాలు వస్తాయని ఓ వ్యక్తిని నమ్మించి, మోసం చేసిన ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మహంకాళి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: కలశం పేరిట కపటం..

- రైస్‌ పుల్లింగ్‌ కలశం విక్రయం పేరుతో మోసం

- ముగ్గురి అరెస్ట్‌, రూ.25 లక్షలు స్వాధీనం

- మరో ఘటనలో నకిలీ యాప్‌తో నగదు స్వాహా

హైదరాబాద్‌ సిటీ: ఎన్నో శక్తులున్న రైస్‌ పుల్లింగ్‌(Rice Pulling) కలశం తమవద్ద ఉన్నదని, అమ్మితే భారీగా లాభాలు వస్తాయని ఓ వ్యక్తిని నమ్మించి, మోసం చేసిన ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మహంకాళి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన శివ సంతోష్ కుమార్‌ (43), చిత్తూరుకు చెందిన మంజునాథ్‌రెడ్డి (38), బెంగళూరుకు చెందిన ఎస్‌ఆర్‌ ప్రతాప్‌ అలియాస్‌ రవీందర్‌ప్రసాద్‌ (44) ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తమ వద్ద శక్తులున్న రాగి కలశం (రైస్‌ పుల్లింగ్‌) ఉందని, దీనిని అధిక ధరలకు విక్రయించవచ్చని ప్రచారం చేసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు


మంజునాథ్‌రెడ్డికి స్నేహితుడి ద్వారా పరిచయమైన శశికాంత్‌కు కలశం గురించి చెప్పాడు. ఈ కలశానికి ఎన్నో శక్తులు ఉన్నాయని, దీనిని ‘అప్రీచెస్‌ అండ్‌ రీసెర్చ్‌’ సంస్థ రూ.10 కోట్లుపెట్టి కొనడానికి సిద్ధంగా ఉందని నమ్మించారు. మంజునాథ్‌రెడ్డి, శశికాంత్‌ సికింద్రాబాద్‌(Secunderabad)లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అదే సమయంలో శివ సంతోష్ కుమార్‌ ‘అప్రీచెస్‌ అండ్‌ రీసెర్చ్‌’ సంస్థ ప్రతినిధిగా వచ్చాడు. కలశం శక్తులను పరీక్షించాలంటే ప్రత్యేక యంత్రాల ద్వారానే సాధ్యమని ఈ స్కానర్లు డీఆర్‌డీఓ వంటి సంస్థల వద్దే ఉంటాయన్నాడు.


పరీక్ష పూర్తయిన తర్వాత కొంటామని, దీనికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని మంజునాథరెడ్డి చెప్పాడు. దానికి అంగీకరించిన శశికాంత్‌ రూ.25 లక్షలు ఇచ్చాడు. స్కానింగ్‌కు మరో రూ.23 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా, దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు శశికాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టిన పోలీసులు మంజునాథ్‌రెడ్డి, శివ సంతోష్ కుమార్‌, ప్రతాప్ లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల నగదు, వెండి కలశం, 7 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


డూప్లికేట్‌ యాప్‌తో రూ. 16.50 లక్షలు లూటీ..

ఇన్వెస్ట్‌మెంట్‌లో నమ్మకంగా లాభాలు ఇచ్చే సంస్థ పేరుతో నకిలీ యాప్‌ను తయారు చేసి 62 ఏళ్ల వృద్ధ మహిళను సైబర్‌ క్రిమినల్స్‌ దగా చేశారు. ఆమె నుంచి రూ. 16.50 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన మహిళకు ట్రేడింగ్‌ యాప్‌లో జాయిన్‌ కావాలని, ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లబ్‌ పేరుతో ఇన్విటేషన్‌ వచ్చింది. ఆ మహిళ గతంలో మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు అందుకుంది. ఇది కూడా అదే సంస్థ అనే భ్రమలో రూ.16.50 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చాయని రూ.29 లక్షలు చెల్లిస్తేనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని బెదిరించారు. అనుమానం వచ్చిన బాధితురాలు వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..

ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం

ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు

ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2024 | 10:23 AM