Hyderabad: దేవుడా.. ఎంతపని చూశావయ్యా.. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో..
ABN , Publish Date - Nov 12 , 2024 | 09:58 AM
గుడిలో ప్రదక్షిణలు చేస్తున్న ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. కేపీహెచ్‌బీ ఎస్సై శ్రీలతారెడ్డి(KPHB SSI Sreelatha Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి(Anantapur District Kadiri)కి చెందిన కనంపల్లి విష్ణువర్దన్ (31) కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌నంబర్-1లోని అమ్మ హాస్టల్లో ఉంటున్నాడు.
- యువకుడి మృతి
హైదరాబాద్: గుడిలో ప్రదక్షిణలు చేస్తున్న ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. కేపీహెచ్‌బీ ఎస్సై శ్రీలతారెడ్డి(KPHB SSI Sreelatha Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి(Anantapur District Kadiri)కి చెందిన కనంపల్లి విష్ణువర్దన్ (31) కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌నంబర్-1లోని అమ్మ హాస్టల్లో ఉంటూ మాదాపూర్(Madapurలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Cybercriminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..
సోమవారం ఉదయం 7 గంటలకు విష్ణువర్దన్ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-3లోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లాడు. ప్రదక్షిణలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. సహచర భక్తులు ప్రథమ చికిత్స చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News