Share News

Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లి..

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:51 AM

విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ఉద్యోగిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడమే కాకుండా అరకిలోమీటరు మేర బైక్‌ను ఈడ్చకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. యాప్రాల్‌(Yapral)లోని స్వర్ణలేక్‌ ఫేజ్‌-2లో నివాసముంటున్న మాజీ ఆర్మీ ఉద్యోగి హరికృష్ణ(44) రాంకీ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు.

Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లి..

- ట్రావెల్స్‌ బస్సు ఢీకొని రాంకీ ఉద్యోగి దుర్మరణం

హైదరాబాద్: విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ఉద్యోగిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడమే కాకుండా అరకిలోమీటరు మేర బైక్‌ను ఈడ్చకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. యాప్రాల్‌(Yapral)లోని స్వర్ణలేక్‌ ఫేజ్‌-2లో నివాసముంటున్న మాజీ ఆర్మీ ఉద్యోగి హరికృష్ణ(44) రాంకీ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. జగద్గిరిగుట్ట(Jagadgirigutta) పైప్‌లైన్‌ రోడ్డులోని ప్లాంట్‌కు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు విధులకు హాజరవుతారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మనీ లాండరింగ్‌ కేసు, డిజిటల్‌ అరెస్టు అంటూ రూ.3 కోట్లు కాజేశారు


రోజు మాదిరి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై విధులకు వెళ్తుండగా గాజులరామారం(Gajularamaram) చౌరస్తా వద్ద ఆర్‌కె ట్రాన్స్‌పోర్టుకు చెందిన బస్సు వేగంగా హరికృష్ణ(Harikrishna) ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతోపాటు 500 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, రాంకీ ఉద్యోగులు షాపూర్‌నగర్‌ చౌరస్తాలో రాస్తారోకోకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడు హరికృష్ణకు భార్య, పిల్లలు ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 08:51 AM