Share News

Hyderabad: భార్య దోసెలు వేసి తెచ్చేలోపే భర్త ఆత్మహత్య..

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:35 PM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దోసెలు వేసి తీసుకొచ్చేలోపే ఈ ఘటన జరగడంతో భార్య నిశ్చేష్ఠురాలైంది. వెంటనే 108కు ఫోన్‌ చేయగా వారు వచ్చి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.

Hyderabad: భార్య దోసెలు వేసి తెచ్చేలోపే భర్త ఆత్మహత్య..

- ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

- భార్య దోసెలు వేసి తెచ్చేలోపు ఘటన

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దోసెలు వేసి తీసుకొచ్చేలోపే ఈ ఘటన జరగడంతో భార్య నిశ్చేష్ఠురాలైంది. వెంటనే 108కు ఫోన్‌ చేయగా వారు వచ్చి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‏స్టేషన్‌(Chilakalguda Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌గడ్డ(Mylargadda)కు చెందిన కిరణ్‌బాబు(38) మినరల్‌ బాటిళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా అతను ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ధూల్‌పేట్‌ మహిళా డాన్‌ అంగూరిబాయి అరెస్ట్‌..


city9.jpg

సాయంత్రం ఇంటికి వచ్చిన కిరణ్‌బాబు(Kiran Babu) భార్యతో ఆకలి వేస్తుంది టిఫిన్‌ రెడీ చేయమన్నాడు. గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుని లుంగీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. దోసెలు వేసుకుని వచ్చిన భార్య తలుపులు కొట్టినా ఎంతకీ తీయకపోవటంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కిందకు దించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య రేణుకతో పాటు ముగ్గురు పిల్లలున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2024 | 12:35 PM