Share News

Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్‌ ఇంజక్షన్‌ ఇచ్చేస్తా..

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:34 PM

ప్రేమించకపోతే ఎయిడ్స్‌(హెచ్‌ఐవీ) ఇంజక్షన్‌ ఇస్తా, చెప్పిన మాట వినలేదో మీ అమ్మానాన్నని చంపేస్తా.. అంటూ బెదిరిస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి శనివారం హయత్‌నగర్‌(Hayatnagar) పోలీసులను ఆశ్రయించింది.

Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్‌ ఇంజక్షన్‌ ఇచ్చేస్తా..

- నర్సింగ్‌ విద్యార్థినికి ఓ యువకుడి బెదిరింపులు

హైదరాబాద్: ప్రేమించకపోతే ఎయిడ్స్‌(హెచ్‌ఐవీ) ఇంజక్షన్‌ ఇస్తా, చెప్పిన మాట వినలేదో మీ అమ్మానాన్నని చంపేస్తా.. అంటూ బెదిరిస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి శనివారం హయత్‌నగర్‌(Hayatnagar) పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. హైదరాబాద్‌, హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన బాధిత యువతి ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. నాగార్జునసాగర్‌(Nagarjunasagar)కు చెందిన చెరుకుపల్లి విజయ్‌కుమార్‌(26) ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా ఆమెకు పరిచయమై స్నేహితుడయ్యాడు.

ఈ వార్తను కూడా చదవండి: Vande Bharat train: ‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు


విజయ్‌ ఇటీవల ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులుగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను చూపించి డబ్బు వసూలు చేశాడు. తనని ప్రేమించకపోతే ఎయిడ్స్‌ ఇంజక్షన్‌ ఇచ్చి జీవితాంతం రోగిలా ఉండేలా చేస్తానని, చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని యువతిని బెదిరిస్తున్నాడు. తనతో బయటకు రావాలంటూ ఇల్లు, బస్టాప్‌, కళాశాల వద్ద ఇబ్బంది పెడుతుండడంతో పాటు చేయి కూడా చేసుకుంటున్నాడు.


ఈ వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి విజయ్‌కుమార్‌(Vijay Kumar) నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న విజయ్‌కుమార్‌ గతంలో మరో ముగ్గురు యువతులను మోసగించాడని, నాగార్జునసాగర్‌ పోలీసుస్టేషన్‌లో అతనిపై కేసు కూడా ఉందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: TG GOVT: వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఈవార్తను కూడా చదవండి: వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Group 3: గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం.. అభ్యర్థులకు అలర్ట్‌

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: 3 నెలలైనా ఉంటా..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 17 , 2024 | 12:34 PM