Hyderabad: జైలులో పరిచయం.. బయటకు వచ్చి దందా
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:25 AM
బెంగళూరు(Bengaluru) నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలుదారుడిని సౌత్‌వె్‌స్టజోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట(Amberpet)కు చెందిన సోలోమన్ సుశాయిరాజ్(33) డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు.
- డ్రగ్స్ విక్రయిస్తున్న పాత నేరస్తులు
- ఇద్దరు పెడ్లర్లు, కొనుగోలుదారుడు అరెస్ట్
- రూ.3.35 లక్షల విలువైన మత్తు పదార్థం స్వాధీనం
హైదరాబాద్ సిటీ: బెంగళూరు(Bengaluru) నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలుదారుడిని సౌత్‌వె్‌స్టజోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట(Amberpet)కు చెందిన సోలోమన్ సుశాయిరాజ్(33) డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు 2021లో స్థానికంగా గంజాయి కొనుగోలు చేయడంతో పాటు తన స్నేహితుడు అబ్బుతో కలిసి బెంగళూరు, గోవా(Bangalore, Goa) తదితర ప్రాంతాలకు వెళ్లి ఎండీఎంఏ, చరస్, ఎక్స్‌ట్రసీ పిల్స్ కొని నగరంలో విక్రయిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పరిచయస్తులే పగబడుతున్నారు.. నిందితుల్లో స్నేహితులే అధికం
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అంబర్‌పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సోలోమన్ తిరిగి డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. డ్రగ్స్ విక్రయిస్తున్న సోలోమన్‌ను 2023 సంవత్సరంలో ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలులో అతడికి గంజాయి కేసులో అరెస్టయిన గౌస్ పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి డ్రగ్స్ దందా చేయడం ప్రారంభించారు.
బెంగళూరులో డ్రగ్స్ విక్రేత నుంచి కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీలు కొనుగోలు చేసి వారు సేవించడమే కాకుండా ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న సౌత్‌వెస్టు జోన్ టాస్క్‌ఫోర్స్, అంబర్‌పేట పోలీసులు కలిసి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.3.35 లక్షల విలువైన 6 గ్రాముల కొకైన్, 15 గ్రాముల ఎండీఎంఏ, 2 ఎల్ఎస్డీ బ్లాట్లు, డ్రగ్ సేవించే కిట్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..
ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Read Latest Telangana News and National News