Share News

Hyderabad: ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా.. ముఖంమీద యాసిడ్‌ పోసి దారి దోపిడీ..

ABN , Publish Date - Aug 30 , 2024 | 01:31 PM

ముఖం మీద యాసిడ్‌ పోసి దారి దోపిడీ చేసిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన నసీం మల్లిక్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10 జహీరానగర్‌(Banjarahills Road No. 10 Zaheeranagar)లో నివాసముంటున్నాడు.

Hyderabad: ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా.. ముఖంమీద యాసిడ్‌ పోసి దారి దోపిడీ..

హైదరాబాద్: ముఖం మీద యాసిడ్‌ పోసి దారి దోపిడీ చేసిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన నసీం మల్లిక్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10 జహీరానగర్‌(Banjarahills Road No. 10 Zaheeranagar)లో నివాసముంటున్నాడు. ఈనెల 23న ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు నెంబరు13 శ్మశాన వాటిక వద్ద ఆరుగురు అడ్డగించారు. బెదిరించి అతని జేబులు వెతికారు. ఫ్యాంటు జేబులో ఉన్న రూ. ఐదు వేలు లాక్కున్నారు. అనంతరం అతడిని కొట్టి యాసిడ్‌ ముఖం మీద పోసారు. మల్లిక్‌ చేతులు అడ్డుపెట్టుకోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. స్నేహితుడి సహాయంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లి తిరిగి ఉస్మానియా(Osmania)కు వెళ్లాడు. ఈనెల 28న ఫిర్యాదు అందడంతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆ తుపాకీ ఎక్కడిది ?


మరో ఘటనలో..

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12కు చెందిన సయ్యద్‌ ఖాద్రి(Syed Qadri) వెల్డింగ్‌ పని చేస్తుంటాడు. ఈనెల 28న పని మీద సింగాడి బస్తీకి వచ్చాడు. అనంతరం రాత్రి రోడ్డు నెంబరు 11 నుంచి వెళ్తుండగా షోయబ్‌ అనే యువకుడు అడ్డుకున్నాడు. డబ్బులు కావాలని అడిగాడు. ఖాద్రి లేవని చెప్పడంతో ముఖంపై కొట్టి అతని జేబులో ఉన్న రూ.1100 తీసుకొని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


.........................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.........................................................................................

Hyderabad: ఆ తుపాకీ ఎక్కడిది ?

- ‘గాజులరామారం’ ఘటనలో నరేశ్‌ ఎక్కడ ?

- కాల్పులపై సైబరాబాద్‌ కమిషనర్‌ ఆరా

హైదరాబాద్: గాజులరామారం కాల్పుల ఘటనలో తుపాకుల అంశం తెరపైకొచ్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అనుచరుడిగా భావిస్తున్న నరేశ్‌ వద్ద తుపాకీ ఎందుకున్నది? దీనితో బెదిరించి ఏమైనా సెటిల్‌మెంట్లు చేశారా? కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎంతమంది వద్ద లైసెన్స్‌లు లేని ఆయుధాలు ఉన్నాయి ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకోడానికి నరేశ్‌ ఇప్పటికే అడ్వొకేట్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తుపాకీతో తానే కాల్పులుజరిపానని శివ అనే యువకుడిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


నరేశ్‌ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, నిందితుడి ప్రేమికురాలిగా చెప్పుకుంటున్న యువతిని ఓ హాస్టల్‌లో ఉంచినట్టు సమాచారం. రాజకీయ నేతలు స్థానిక పోలీస్‌ అధికారుల సాయంతో ఈ కేసును మూసివేయడానికి ప్రయత్నించడంతో సైబరాబాద్‌ కమిషనర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు నరేశ్‌ను పట్టుకున్న తర్వాతే ఏదైనా మాట్లాడాలని గట్టిగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.


వివాదాల్లో ఆరితేరి..

సెటిల్‌మెంట్లు, భూవివాదాలు, కొట్లాటల్లో ఆరితేరిన మల్లంపేట నరేశ్‌ కబ్జాలు చేస్తూ పలువురిని బెరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం క్రితం బిహార్‌ నుంచి కొన్ని తుపాకులు తెప్పించినట్టు తెలుస్తోంది. ఈ తుపాకులు ఎవరిని హత్య చేయడానికి తీసుకొచ్చారనేది తేలాల్సి ఉంది. కాగా, పరారీలో ఉన్న నరేశ్‌ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన సెల్‌ఫోన్‌ కూడా పనిచేయడం లేదని తెలిసింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2024 | 01:31 PM