Hyderabad: ఫోన్‌లో నగలు ఆర్డర్.. వచ్చాక చెల్లని చెక్కులు
ABN , Publish Date - Sep 03 , 2024 | 10:43 AM
పేరుమోసిన బంగారు నగల దుకాణాల నంబర్లను గూగుల్ ద్వారా సేకరించి ఫోన్ చేస్తాడు. ఖరీదైన నగలు ఆర్డర్ చేసి, చెల్లని చెక్కులు ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇలా నగరంలో పలు బంగారు నగల దుకాణ యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
- బంగారు దుకాణాల యజమానులకు టోకరా
- అరెస్ట్ చేసిన ఎస్‌వోటీ పోలీసులు
హైదరాబాద్ సిటీ: పేరుమోసిన బంగారు నగల దుకాణాల నంబర్లను గూగుల్ ద్వారా సేకరించి ఫోన్ చేస్తాడు. ఖరీదైన నగలు ఆర్డర్ చేసి, చెల్లని చెక్కులు ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇలా నగరంలో పలు బంగారు నగల దుకాణ యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గండిపేట(Gandipet)కు చెందిన గుంటి సుమన్ (43) తన స్నేహితులు శాలిబండకు చెందిన అజయ్‌కుమార్ సోని, రఘులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. లాభాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. అజయ్‌కుమార్ సోని, రఘు తక్కువ సమయంలో రెట్టింపు సంపాదించేందుకు షార్ట్‌ఫిల్మ్ మేకింగ్(Short film making)లో పెట్టుబడి పెట్టాలని చెప్పారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ముంబై రైలు ఎక్కారు..
రమాదేవి అనే మహిళను పరిచయం చేసి, ఆమెకు రూ.2 కోట్లు ఇస్తే షార్ట్‌ఫిల్మ్‌లో పెట్టుబడి పెడుతుందని, తక్కువ కాలంలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని చెప్పారు. ఇందుకోసం కావాల్సిన పెట్టుబడిని దుకాణదారులను మోసం చేసి సంపాదించాలని సుమన్ ప్లాన్ చేశాడు. గూగుల్‌లో ప్రముఖ బంగారు నగల దుకాణాల ఫోన్ నంబర్లకు కాల్ చేసి లేటెస్ట్ డిజైన్లు ఉన్న బంగారు నగల ఫొటోలు వాట్సప్(Whatsapp)లో పంపమని అడిగేవాడు. వారు పంపిన ఫొటోల్లో ఖరీదైన నగలను ఎంపిక చేసి ఇంటికి డెలివరీ చేయమని కోరేవాడు. నగలు డెలివరీ చేయడానికి వచ్చిన ఉద్యోగులకు ఖాతాలో డబ్బులు లేవంటూ మూసివేసిన బ్యాంకు ఖాతాలకు చెందిన చెల్లని చెక్కులను ఇచ్చేవాడు.
అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకునేవాడు. వరుసగా నగల దుకాణ యజమానుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఎస్‌వోటీ అధికారులు నిఘా ఉంచి సుమన్‌ను అరెస్ట్ చేసి, రూ.82 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. లింగంపల్లి, పంజాగుట్ట, చార్మినార్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్న జువెల్లరీ యజమానులకు టోకరా పెట్టి దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు కాజేశాడని ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................................
Hyderabad: బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ చోరీ ముఠా అరెస్ట్..
- 200 సీసీ ఫుటేజీల పరిశీలన
- బైక్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: అర్ధరాత్రి అండర్‌గ్రౌండ్ కేబుల్(Underground cable) చోరీ చేసిన ముఠా సభ్యులు 14 మందిని బోయినపల్లి పోలీసులు(Boinapally Police) అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రేష్మి పెరుమాల్(North Zone DCP Reshmi Perumal) వివరాలు వెల్లడించారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బీఎస్ఎన్‌ఎల్(BSNL) సంస్థకు చెందిన కాపర్ కేబుల్స్ చోరీ అవుతున్నాయని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 200 సీసీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. బైక్ నంబర్ ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కేబుల్ చోరీ చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువ చేసే 120 కిలోల కాపర్ వైర్ల బండిల్, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు వీరే..
హయత్‌నగర్‌కు చెందిన వల్లపు వినోద్(27), బందన్ వీరన్న(32), వేముల శ్రీను(22), గుంజా రాములు(23), వేముల రాజేష్(19), గోగుల వినోద్(35), వేముల ఏసు(35), వేముల నాగరాజు(26), వల్లపు వినయ్(19), వేముల సైదులు(30), గుంజా కృష్ణ(42), బంద్రి ప్రవీణ్(21), రాంబాబు(25), కె. శ్రీనివాస్(22)ను అరెస్ట్ చేశారు. కె. రమేష్(33), సత్యనారాయణ (58), మహేష్ పరారీలో ఉన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News