Share News

Hyderabad: ప్రేమ.. పెళ్లి.. ఆపై హత్య

ABN , Publish Date - Nov 19 , 2024 | 07:00 AM

ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం పెడదామని తీసుకెళ్లి హత్యచేశాడో యువకుడు. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌(Miyapur Inspector Krantikumar) తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ ప్రాంతానికి చెందిన దంపతుల కుమార్తె(17) 20 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

Hyderabad: ప్రేమ.. పెళ్లి.. ఆపై హత్య

- దిండుతో ఊపిరాడకుండా చేసి మైనర్‌ మర్డర్‌

- ప్రేమికుడితోపాటు మరో ఇద్దరి రిమాండ్‌

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం పెడదామని తీసుకెళ్లి హత్యచేశాడో యువకుడు. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌(Miyapur Inspector Krantikumar) తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ ప్రాంతానికి చెందిన దంపతుల కుమార్తె(17) 20 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుమార్తె కనిపించడం లేదంటూ ఈనెల 10వ తేదీన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా బంద్.. ఎందుకోసమంటే..


చింటూ అలియాస్‌ విఘ్నేష్‌(22) అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఉప్పుగూడకు చెందిన విఘ్నే్‌షకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో బాలిక అతడతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.


ఆమెను చింటూ తన స్నేహతులు సాకేత్‌, కళ్యాణి వద్ద ఉంచాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక బలవంతం చేయడంతో ఈనెల 8న దండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలు, వీడియోలు తీసి బాలికను నమ్మించాడు. పథకం ప్రకారం ఆమెను దిండు సహాయంతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో తుక్కుగూడలో ప్లాస్టిక్‌ పరిశ్రమ పరిసరాల్లో నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.


రెండు రోజుల క్రితం మియాపూర్‌(Miyapur) వెళ్తున్నానని బయలుదేరిందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. కుమార్తె ఇంటికి రాకపోవడం, ఫోన్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడితోపాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. బాలికను హత్య చేసేందుకు గల కారణాలు తెలియరాలేదు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 07:21 AM