Share News

Hyderabad: నా పేరు డాక్టర్‌ గోపాల్‌.. న్యూరో సర్జన్‌...

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:25 PM

కొంపల్లి(Kompally)లోని ఓ ఆసుపత్రి సీఈఓకు మాయమాటలు చెప్పి, ఫోన్‌పే ద్వారా ఐదు వేల రూపాయలను ఓ నకిలీ డాక్టర్‌ కొల్లగొట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంపల్లి ప్రాంతంలో పి.శశిధర్‌గౌడ్‌ గౌతమ్‌ నీరో కేర్‌ సెంటర్‌లో సీఈఓగా పనిచేస్తున్నాడు.

Hyderabad: నా పేరు డాక్టర్‌ గోపాల్‌.. న్యూరో సర్జన్‌...

- ఓ ఆస్పత్రి సీఈఓకు టోకరా

హైదరాబాద్: కొంపల్లి(Kompally)లోని ఓ ఆసుపత్రి సీఈఓకు మాయమాటలు చెప్పి, ఫోన్‌పే ద్వారా ఐదు వేల రూపాయలను ఓ నకిలీ డాక్టర్‌ కొల్లగొట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంపల్లి ప్రాంతంలో పి.శశిధర్‌గౌడ్‌ గౌతమ్‌ నీరో కేర్‌ సెంటర్‌లో సీఈఓగా పనిచేస్తున్నాడు. అతడికి గత నెల 22న మధ్యాహ్నం 2.20కు డాక్టర్‌ గోపాల్‌, న్యూరో సర్జన్‌ పేరుతో ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: New Year: తారల తళుకులు.. మోడళ్ల మెరుపులు.. ఈసారి అంతకుమించి..


మీ ఆసుపత్రి ఎండీ నా స్నేహితుడని ఆ వ్యక్తి తెలిపాడు. అలాగే మా మామకు యాక్సిడెంట్‌ అయింది, అంబులెన్స్‌లో మీ ఆసుపత్రికి పంపిస్తున్నా, ఆయన ఫోన్‌పే లిమిట్‌ దాటిపోయిందని, 5వేలు ఫోన్‌పే చేస్తే అంబులెన్స్‌కు చెల్లిస్తారని చెప్పాడు. నకిలీ డాక్టర్‌ చెప్పిన విధంగా శశిధర్‌గౌడ్‌ రూ.5వేలు చెల్లించాడు.


ఎంతకూ యాక్సిడెంట్‌ కేసు రాకపోవడంతో తిరిగి ఫోన్‌చేయగా, అతడు అసభ్య పదజాలంతో దుర్భషలాడాడు. దీంతో మోసపోయానని తెలిసి శశిధర్‌ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ డాక్టర్‌ గుంటూరు జిల్లా, కాకుమా ను ప్రాంతలోని గరికపాడు(Garikapadu) గ్రామానికి చెందిన భార్గవ్‌గా గుర్తించి శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: 7న విచారణకు రండి

ఈవార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!

ఈవార్తను కూడా చదవండి: Nalgonda: ఫోన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ తీగను తాకి..

ఈవార్తను కూడా చదవండి: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 29 , 2024 | 12:25 PM