Hyderabad: ఒకరనుకొని మరొకరిని చితక బాదారుగా...
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:56 PM
తన భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి మరో వ్యక్తిపై దాడిచేసిన ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీ(KPHB Dharma Reddy Colony(లోని ఓ హాస్టల్‌లో కడపకు చెందిన గాలి వరప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు.
హైదరాబాద్: తన భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి మరో వ్యక్తిపై దాడిచేసిన ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీ(KPHB Dharma Reddy Colony)లోని ఓ హాస్టల్‌లో కడపకు చెందిన గాలి వరప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. బుధవారం అర్థరాత్రి ఓ యువ తి, ముగ్గురు వ్యక్తులు ధర్మారెడ్డి కాలనీలోని హాస్టళ్లలో వెతుకుతూ గాలి వరప్రసాద్(Gali Varaprasad) ఉన్న హాస్టల్ వద్దకు వచ్చారు. ఇక్కడ వరప్రసాద్ ఎవరైనా ఉన్నారా అని హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు గాలి వరప్రసాద్‌కు సమాచారం ఇచ్చి కిందకు పిలిచారు.
ఈ వార్తను కూడా చదవండి: KTR: రాజీనామా చేస్తా.. వాళ్లకు కేటీఆర్ సవాల్
వరప్రసాద్ బయటకు రాగానే ఆ ముగ్గురు అతడిపై పిడుగుద్దులు గుద్దుతూ బెల్ట్‌తో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని విచారించారు. దాడి చేసిన వ్యక్తులు వేరొక వరప్రసాద్ కోసం వచ్చి తప్పుగా గాలి వరప్రసాద్‌పై దాడిచేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుమేరకు దాడిచేసిన అదిల్, పుష్ప, సుమంత్‌లుగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News