Share News

Hyderabad: మన హైదరాబాద్ బాగా డవలప్ అయ్యింది బాస్.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Dec 31 , 2024 | 08:11 AM

దారిదోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను లాలాగూడ పోలీసులు(Lalaguda Police) అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెన్‌కో ఉద్యోగి(56) గతనెల 6వ తేదీ సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు.

Hyderabad: మన హైదరాబాద్ బాగా డవలప్ అయ్యింది బాస్.. ఏం జరిగిందో తెలిస్తే..

- మహిళల దారిదోపిడీలు.. ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్: దారిదోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను లాలాగూడ పోలీసులు(Lalaguda Police) అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెన్‌కో ఉద్యోగి(56) గతనెల 6వ తేదీ సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాప్‌లో మల్కాజిగిరికి చెందిన భాగ్య అనే మహిళ అతడిని ఆపింది. కాళ్లు నొప్పిగా ఉన్నాయని, లాలాపేట వరకు దించమని ప్రాధేయపడింది. జెన్‌కో ఉద్యోగి ఆమెను బైక్‌ ఎక్కించుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇక.. అన్ని రూట్లలో ఈవీ బస్సులు


లాలాపేట్‌లో జీహెచ్‌ఎంసీ(GHMC) మైదానం వరకు వెళ్లగానే మహిళ అతడిని బెదిరించి ఫోన్‌ పే ద్వారా రూ. 95 వేలు ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకుంది. అనంతరం అతడిని కుషాయిగూడ వైపు తీసుకెళ్లి నీ బ్యాంకు ఖాతాలో ఎంత ఉంటే అంత తన ఖాతాకు పంపించాలని బెదిరించింది. అతడి నుంచి బలవంతంగా రూ. 1.50 లక్షలు ఖాతాలో జమచేయించుకుంది.


city4.jpg

ఈనెల 3వ తేదీన భాగ్య మేనకోడలు వెన్నెల డీటీడీసీ కొరియర్‌ సంస్థకు ఫోన్‌ చేసింది. తన వద కొరియర్‌ ఉందని, తీసుకెళ్లమని కోరింది. ఆమె వద్దకు వచ్చిన కొరియర్‌ బాయ్‌ను బెదిరించి రూ. 1.70 లక్షలు వసూలు చేసింది. వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాళ్ల ఫోన్‌ నంబర్ల ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు.


విచారించగా నేరాన్ని అంగీకరించారు. 2018లో వెన్నెల మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసింది. ఈ ఏడాది మార్చిలో భాగ్య చిలకలగూడ పోలీస్‏స్టేషన్‌(Chilakalguda Police Station) పరిధిలో రైల్వే ఉద్యోగిని బెదిరించి డబ్బు కాజేసింది. ఇలాంటి మహిళలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులు ఇద్దరినీ సోమవారం రిమాండ్‌కు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి

ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2024 | 08:11 AM