Share News

Hyderabad: సైదాబాద్‌లో గాల్లోకి పోలీసుల కాల్పులు..

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:23 PM

సైదాబాద్‌(Saidabad)లో ఆదివారం రాత్రి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. దాడి చేసి పారిపోతున్న చైన్‌స్నాచర్‌(Chainsnatcher)ను పట్టుకునేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. చివరకు సినీఫక్కీలో వెంబడించి చైన్‌స్నాచర్‌ను పట్టుకున్నారు.

Hyderabad: సైదాబాద్‌లో గాల్లోకి పోలీసుల కాల్పులు..

- పోలీసుల అదుపులో చైన్‌స్నాచర్‌..?

హైదరాబాద్: సైదాబాద్‌(Saidabad)లో ఆదివారం రాత్రి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. దాడి చేసి పారిపోతున్న చైన్‌స్నాచర్‌(Chainsnatcher)ను పట్టుకునేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. చివరకు సినీఫక్కీలో వెంబడించి చైన్‌స్నాచర్‌ను పట్టుకున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చైన్‌స్నాచర్‌ అమీర్‌ శంకేశ్వర్‌బజార్‌ పరిసరాలలో అనుమానాస్పదంగా సంచరిసున్నట్లు పోలీసులకు సమాచారమందింది దీంతో వెంటనే అలర్ట్‌ అయిన యాంటీ డెకాయిట్‌ టీం(Anti Decoy Team) పోలీసులు శంకేశ్వర్‌బజార్‌కు చేరుకుని టీ స్టాల్‌ సమీపంలో తచ్చాడుతున్న అమీర్‌ను గుర్తించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కోకాపేటలో రూ.498 కోట్లతో జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌..


అతడిని తనిఖీ చేసేందుకు పోలీసులు యత్నించగా దాడి చేసి పరుగులు తీశాడు. సినీఫక్కీలో పోలీసులు లొంగిపోవాలని హెచ్చరిస్తూ ఒక రౌండ్‌ గాలిలో కాల్పులు జరిపారు. అయినా అమీర్‌ పట్టించుకోకుండా పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం. సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 12:23 PM