Share News

Hyderabad: తుపాకీ చూపించి చోరీలు.. ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Aug 30 , 2024 | 08:55 AM

తుపాకీ చూపించి చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు(Rajendranagar Police) అరెస్ట్‌ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. బిహార్‌(Bihar) రాష్ట్రం పూర్ణియా జిల్లా, హక్క ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ముసాయిద్‌ అలామ్‌(28), మహ్మద్‌ దిల్‌బర్‌(24), మహ్మద్‌ షానవాజ్‌(29) పిల్లర్‌ నంబర్‌ 190 వద్దగల హ్యాపీహోమ్స్‌ అవెన్యూలో అద్దెకు ఉంటున్నారు.

Hyderabad: తుపాకీ చూపించి చోరీలు.. ఇద్దరి అరెస్టు

హైదరాబాద్: తుపాకీ చూపించి చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు(Rajendranagar Police) అరెస్ట్‌ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. బిహార్‌(Bihar) రాష్ట్రం పూర్ణియా జిల్లా, హక్క ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ముసాయిద్‌ అలామ్‌(28), మహ్మద్‌ దిల్‌బర్‌(24), మహ్మద్‌ షానవాజ్‌(29) పిల్లర్‌ నంబర్‌ 190 వద్దగల హ్యాపీహోమ్స్‌ అవెన్యూలో అద్దెకు ఉంటున్నారు. ముగ్గురూ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు.


city2.2.jpg

బిహార్‌ నుంచి నెల క్రితం కంట్రీమేడ్‌ పిస్టల్‌ తీసుకొచ్చి జనచైతన్య ఫేజ్‌-2లో ఓ వ్యక్తిని బెదిరించి రూ. 11 వేలు దోచుకున్నారు. కిస్మత్‌పూర్‌(Kismatpur) బ్రిడ్జి వద్ద రాత్రివేళ ఓ వ్యక్తిని బెదిరించి సెల్‌ఫోన్‌, రూ. 200 దోచుకున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు మహ్మద్‌ ముసాయిద్‌ అలామ్‌, మహ్మద్‌ దిల్‌బర్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కంట్రీమేడ్‌ పిస్టల్‌, బుల్లెట్‌, బైక్‌, మొబైల్‌ ఫోన్‌, స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్‌ షానవాజ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


.......................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................

Hyderabad: 101 గజాలు.. రూ.10 కోట్లు

- బేగంబజార్‌లో కోట్లు పలుకుతున్న స్థలాలు

- ఇటీవల రాజస్థాన్‌ వ్యాపారి కొనుగోలు

అఫ్జల్‌గంజ్‌(హైదరాబాద్): హోల్‌సేల్‌ మార్కెట్‌కు పేరుగాంచి నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే బేగంబజార్‌(Begambazar)లో స్థలాల ధరలు కోట్లు పలుకుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఫీల్‌ఖానాలో ఇటీవల 101 గజాల పాత ఇంటిని రాజస్థాన్‌కు చెందిన హోల్‌సేల్‌ కిరాణ వ్యాపారి రూ.10 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నగరంలో కోకాపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌(Kokapet, Banjara Hills, Jubilee Hills)లతో బేగంబజార్‌ పోటీపడుతోందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌కు ఖ్యాతిపొందిన మహరాజ్‌గంజ్‌, ఫీల్‌ఖానా, బేగంబజార్‌(Maharajganj, Feelkhana, Begambazar)లోని పాత ఇళ్లు యజమానులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక్కడ దుకాణం కిరాయి నెలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షలు పలుకుతోంది.

city1.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2024 | 08:55 AM