Share News

Hyderabad: రూ. 1500 కోసం చిన్నారి కిడ్నాప్‌..

ABN , Publish Date - Aug 28 , 2024 | 10:32 AM

అప్పుగా తీసుకున్న రూ.1500 ఇవ్వలేదన్న కక్షతో ఏడాదిన్నర పాపను ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. 12 గంటల్లోనే కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌(Kachiguda Police Station)లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం డీసీపీ బి. బాలస్వామి, అడిషనల్‌ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, సీఐ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.

Hyderabad: రూ. 1500 కోసం చిన్నారి కిడ్నాప్‌..

- 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

- మహిళ అరెస్ట్‌.. మరొకరు పరార్‌

హైదరాబాద్: అప్పుగా తీసుకున్న రూ.1500 ఇవ్వలేదన్న కక్షతో ఏడాదిన్నర పాపను ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. 12 గంటల్లోనే కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌(Kachiguda Police Station)లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం డీసీపీ బి. బాలస్వామి, అడిషనల్‌ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, సీఐ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాం డ్‌ ఫుట్‌పాత్‌పై యాచకురాలు పార్వతమ్మ తన మనవరాలు శ్రీలక్ష్మి(యేడాదిన్నర)తో కలిసి నిద్రిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మనవరాలు కనిపించకపోవడంతో కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష


వెంటనే సీఐ చంద్రకుమార్‌, డీఐ కె.మల్లేశ్వరి, ఎస్‌ఐలు కె. సుభాష్‌, నరేష్‌ కుమార్‌, జి. సురేష్‌ కుమార్‌, రామాంజనేయులుతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ చిన్నారిని తీసుకొని ఆటోలో అఫ్జల్‌గంజ్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి డబీర్‌పురా రైల్వేస్టేషన్‌(Dabirpura Railway Station) వరకు దాదాపు 60 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. డబీర్‌పురా రైల్వేస్టేషన్‌ వద్ద పాపను గుర్తించి కిడ్నాప్‌ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె కామారెడ్డి(Kamareddy) జిల్లాకు చెందిన దాసరి మంజుల(29)గా గుర్తించారు. ఈమె జల్సాలు చేస్తూ తరచూ భర్తతో గొడవపడేది.


city4.2.jpg

కామారెడ్డి నుంచి నగరానికి వచ్చి భిక్షాటన చేసి తిరిగి వెళ్లిపోయేది. కిడ్నా్‌పకు గురైన చిన్నారి తల్లి మమత ఆమె వద్ద గతంలో రూ.1500 అప్పుగా తీసుకుని తిరిగివ్వలేదు. అది మనుసులో పెట్టుకున్న మంజుల; మరిది మున్నాతో కలిసి సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలోకి వచ్చింది. రాత్రి 11.30 సమయంలో అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లింది. సీసీటీవీఫుటేజీల సహాయంతో పోలీసులు మంగళవారం ఉదయం 11.30 గంటలకు మంజులను పట్టుకున్నారు.


చిన్నారి శ్రీలక్ష్మిని అమ్మమ్మ పార్వతమ్మకు అప్పగించారు. తీసుకున్న డబ్బులు మమత ఇవ్వకపోవడం వలన ఆమె కుమార్తెను అమ్మడానికే ఈ కిడ్నాప్‌ చేసినట్లు మంజుల పోలీసు విచారణలో ఒప్పుకుంది. ఆమెను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మంజుల మరిది మున్నా పరారీలో ఉన్నాడు. కిడ్నాప్‌ కేసును 12 గంటల్లో ఛేదించినందుకు కాచిగూడ పోలీసులను డీసీపీ అభినందించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 10:32 AM