Share News

Hyderabad: తుపాకీతో కాల్చి చంపేస్తా...

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:59 AM

కుమారుడి జాడ చెప్పాలని.. లేకుంటే తుపాకీతో కాల్చిచంపుతానని ఎస్‌ఐ బెదిరిస్తున్నాడని ఓ దళిత మహిళ వాపోయింది. మూడు నెలలుగా తనను స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది.

Hyderabad: తుపాకీతో కాల్చి చంపేస్తా...

- దళిత మహిళకు ఎస్‌ఐ చిత్రహింసలు

- ఓ కేసు విషయంలో పలుమార్లు దాడి

- 3 నెలలుగా పీఎస్‌కు వచ్చిపోతున్న మహిళ

- బషీరాబాద్‌ ఎస్‌ఐ వేధిస్తున్నాడని ఆరోపణ

హైదరాబాద్: కుమారుడి జాడ చెప్పాలని.. లేకుంటే తుపాకీతో కాల్చిచంపుతానని ఎస్‌ఐ బెదిరిస్తున్నాడని ఓ దళిత మహిళ వాపోయింది. మూడు నెలలుగా తనను స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. గురువారం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దీనంగా కూర్చున్న ఆమెను విలేకరులు పలకరించగా.. గోడును వెల్లబోసుకుంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌(Vikarabad District Basheerabad) మండలం నవల్గాకు చెందిన లోహడ నరేశ్‌(17) కాశీంపూర్‌ గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లి అదే గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమించాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!


ఇద్దరూ దళితులే. కొన్ని నెలలు ప్రేమించుకున్న వీరు మే 2న ఇళ్లలోంచి వెళ్లిపోయారు. తన కూతురిని నరేశ్‌ కిడ్నాప్‌ చేశాడని బాలిక తల్లిదండ్రులు బషీరాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Basheerabad Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేశ్‌ తల్లి లోహడ కళావతిని ఎస్‌ఐ రమేశ్‌ కుమార్‌(SI Ramesh Kumar) పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడు. కుమారుడి జాడ చెప్పాలంటూ ఎస్‌ఐ బూతులు తిట్టాడని కళావతి వాపోయింది.


కాల్చి చంపి పేపర్‌లో ఆ వార్త వేయిస్తానని బెదిరించాడని తెలిపింది. నరేశ్‌ ఆచూకీ తెలిసే వరకు రోజూ స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశాడని చెప్పింది. దీంతో 3 నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకూ పోలీస్‌ స్టేషన్‌(Police station)లోనే కూర్చొని.. ఇంటికి పోతున్నానని వెల్లడించింది. కూలి పనులపై బతికే తాను రోజూ స్టేషన్‌కు వస్తుండటంతో పూట గడవడం కష్టంగా మారిందని వాపోయింది. ఎస్‌ఐ పలుమార్లు తన చేతులు, కాళ్లపై లాఠీతో కొట్టడంతో వాపులొచ్చాయని కన్నీటి పర్యంతమైంది.


ఈ విషయమై విలేకరులు ఎస్‌ఐ స్పందన కోరగా.. ‘ఏమైనా రాసుకోండి’ అని సమాధానం ఇచ్చారు. కాగా, దళిత మహిళను వేధిస్తున్న ఎస్‌ఐపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో తాండూరు డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2024 | 09:59 AM