Share News

Hyderabad: జల్సాల కోసం చోరీలు చేసి చివరకు...

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:15 AM

జల్సాల కోసం ల్యాప్‌టాప్‏లు చోరీ చేస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొనుగోలు చేస్తున్న ఇద్దరిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు(SR Nagar Police) అరెస్ట్‌ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు.

Hyderabad: జల్సాల కోసం చోరీలు చేసి చివరకు...

- ముగ్గురి అరెస్ట్‌.. 9 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

హైదరాబాద్: జల్సాల కోసం ల్యాప్‌టాప్‏లు చోరీ చేస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొనుగోలు చేస్తున్న ఇద్దరిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు(SR Nagar Police) అరెస్ట్‌ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలం, పాతమల్లాపురం గ్రామానికి చెందిన బండ్లమూడి చిన్న అవులయ్య(30) ఎర్రగడ్డలో నివసిస్తూ మెట్రోస్టేషన్‌(Metro station)లో సెక్యూరిటీగార్డుగా పనిచేసేవాడు. కొవిడ్‌ సమయంలో స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తిరిగి 2023లో నగరానికి వచ్చి గచ్చిబౌలి, కొండాపూర్‌(Gachibowli, Kondapur) ప్రాంతాల్లో కొంతకాలం సెక్యూరిటీగార్డుగా పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు.


ఎస్‌ఆర్‌నగర్‌, బాపూనగర్‌ పరిసర ప్రాంతాల్లో హాస్టళ్లలో ల్యాప్‌టా్‌పలు దొంగిలించాడు. వీటిని నేరేడ్‌మెట్‌(Neredmet)లో సెల్‌ఫోన్‌ మరమ్మతుల షాపు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన వెంకటకృష్ణ(33), అంబర్‌పేటలో ఉంటున్న బెస్తవారిపేటకు చెందిన మేక ల వెంకటేశ్వర్లు(30)కు విక్రయించేవాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అమీర్‌పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అవులయ్య, వెంకటకృష్ణ, వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2.13 లక్షల విలువైన 9 ల్యాప్‌టాప్‏లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాత్‌, ఎస్‌ఐ రాజురాథోడ్‌ పాల్గొన్నారు.


................................................................

ఈ వార్తను కూడా చదవండి:

................................................................

Hyderabad: చాట్‌లో బొద్దింక కలకలం..

హైదరాబాద్: తిను బండారంలో బొద్దింక కనిపించిన ఘటన వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వనస్థలిపురానికి(Vanasthalipuram) చెందిన రవి తమ ప్రాంతంలోని పనామా చౌరస్తాలో ఉన్న స్వీట్‌ షాపులో చాట్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి పిల్లలు తినేందుకు చాట్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ చేయగా అందులో చనిపోయిన బొద్దింక కనిపించింది. రవి దానిని తీసుకెళ్లి కొనుగోలు చేసిన షాపు యజమానికి చూపించాడు. అయితే యజమాని మాత్రం చాట్‌లో పడిన బొద్దింకతో తమకు ఎలాంటి సంబంధం లేదని,

city5.jpg


ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో బాధితుడు మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులు బొద్దింక విషయంపై వివరణ అడిగారు. ఆగ్రహంతో ఊగిపోయిన షాపు యజమాని మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించాడు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ షాపును సీజ్‌ చేయాలని బాధితుడు రవితో పాటు అక్కడున్న వినియోగదారులు అధికారులను కోరారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 31 , 2024 | 11:15 AM