Share News

Hyderabad: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య..

ABN , Publish Date - Aug 11 , 2024 | 10:38 AM

భార్యపై అనుమానం పెనుభూతంగా మారి భర్తే ఆమెను నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం నాంపల్లి పోలీస్‏స్టేషన్‌(Nampally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయ్‌నగర్‌-లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఆస్మాబేగం (38) భర్త అనారోగ్యంతో కొంత కాలం క్రితం చనిపోయాడు.

Hyderabad: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య..

హైదరాబాద్: భార్యపై అనుమానం పెనుభూతంగా మారి భర్తే ఆమెను నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం నాంపల్లి పోలీస్‏స్టేషన్‌(Nampally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయ్‌నగర్‌-లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఆస్మాబేగం (38) భర్త అనారోగ్యంతో కొంత కాలం క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. ఆస్మాబేగం స్థానికంగా ఒకరి ఇంట్లో వంట చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. వరంగల్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ హసన్‌ (45)తో పరిచయం ఏర్పడగా, అతడిని రెండో వివాహం చేసుకుంది. హసన్‌ మొదటి భార్య వదిలేయడంతో ఆస్మాబేగంను రెండో వివాహం చేసుకున్నాడు. అతనికీ పిల్లలు ఉన్నారు.

ఇదికూడా చదవండి: Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ


హసన్‌ మల్లెపల్లిలోని ఐటీఐ కేంద్రంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. విజయ్‌నగర్‌ కాలనీ(Vijaynagar Colony)లో భార్య ఆస్మా బేగం, నలుగురు పిల్లలతో కలిసి ఉండేవాడు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. భార్యపై అనుమానం పెంచుకుని తరచూ కొట్టి, వేధించే వాడు. దీంతో విసిగిపోయిన ఆమె రెండు నెలల నుంచి హసన్‌కు దూరంగా ఉంటోంది. దీంతో హసన్‌(Hasan) భార్యపై కోపం పెంచుకొని శనివారం మధ్యాహ్నం సమయంలో ఆమె పని చేస్తున్న ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, బజార్‌ఘట్‌ ఏ బ్యాటరీ లైన్‌ వీధికి రాగా, వెనుక నుంచి వచ్చిన మహ్మద్‌ హసన్‌ వచ్చి ఆస్మా బేగంను అటకాయించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.


ఆగ్రహంతో ఊగిపోయిన హసన్‌ తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో ఆస్మాబేగం పొత్తి కడుపులో పొడిచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పని అపస్మారక స్థితికి చేరుకున్న ఆస్మాబేగంను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆమెను ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి తరలించగా, పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. మహ్మద్‌ హసన్‌ ఆస్పత్రికి వచ్చి ఆస్మాబేగం చనిపోయిందని దూరం నుంచి గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 11 , 2024 | 10:38 AM