Share News

Hyderabad: అనుమానం.. తీసింది ప్రాణం

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:42 AM

అనుమానం పెనుభూతమైంది. అది మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Hyderabad: అనుమానం.. తీసింది ప్రాణం

- భార్యను హతమార్చి పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త

హైదరాబాద్: అనుమానం పెనుభూతమైంది. అది మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ హషమాబాద్‌(Bandlaguda Hashamabad)కు చెందిన ఫయాజ్‌ ఖురేషి(26), ఖమర్‌ బేగం (23) భార్యాభర్తలు.

ఈ వార్తను కూడా చదవండి: ఆ దాడి వెనుక బీఆర్ఎస్ ప్రోద్బలం.. చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్


వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు సంతానం ఉన్నారు. ఫయాజ్‌ చిన్నాచితక పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కొన్నాళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. రెండేళ్ల క్రితం విడిపోగా, పెద్దలు సర్దిచెప్పడంతో మళ్లీ కలిసి ఉంటున్నారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకొన్న ఫయాజ్‌(Fayaz) తరచూ వేధించసాగాడు. సోమవారం రాత్రి ఖురేషి తల్లి, పిల్లలు ఒక గదిలో, మరో గదిలో భార్యాభర్తలు నిద్రపోయారు. ఇద్దరి మఽధ్య మాటామాట పెరగడంతో కోపోద్రిక్తుడైన ఫయాజ్‌ ఖురేషీ పదునైన ఆయుధంతో భార్య గొంతు కోశాడు.


city1.jpg

అగ్నిప్రమాదంగా చిత్రీకరించాలనుకొని బైక్‌లో ఉన్న పెట్రోల్‌ తెచ్చి భార్య ఖమర్‌ బేగంపై పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపిం చడంతో పక్కగదిలో నిద్రిస్తున్న తల్లి, పిల్లలు లేచి అరవడంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఖమర్‌ బేగం మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 06:42 AM